Watch Video: రివ్యూ తీసుకోకుండా చర్చలేంటి.. నీ సమయం మించిపోయింది వెళ్లిపో: కివీస్‌ ఓపెనర్‌కు అశ్విన్ సైగలు..!

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ విల్ యంగ్ (2) వికెట్ విచిత్రమైన రీతిలో పెవిలియన్ చేరాడు. అశ్విన్ తన రెండో ఓవర్ చివరి బంతికి అశ్విన్ ఎల్‌బీడబ్ల్యు కోసం అప్పీల్..

Watch Video: రివ్యూ తీసుకోకుండా చర్చలేంటి.. నీ సమయం మించిపోయింది వెళ్లిపో: కివీస్‌ ఓపెనర్‌కు అశ్విన్ సైగలు..!
Ashwin Vs Will Young
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2021 | 7:18 AM

India Vs New Zealand Test: న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ విల్ యంగ్ (2) వికెట్ విచిత్రమైన రీతిలో పెవిలియన్ చేరాడు. అశ్విన్ తన రెండో ఓవర్ చివరి బంతికి అశ్విన్ ఎల్‌బీడబ్ల్యు కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఆలస్యం చేయకుండా కివీ ఓపెనర్‌ను ఔ‌ట్‌గా ప్రకటించాడు. యంగ్ తన భాగస్వామి టామ్ లాథమ్‌తో మాట్లాడాడు. రివ్యూ కోసం సైగ చేశాడు. కానీ, DRS సమయం అయ్యాక రివ్యూ కోరాడు. దీంతో చేసేంది ఏంలేక నిస్సహాయంగా చూస్తున్నాడు. వెంటనే అశ్విన్ యాక్షన్‌లోకి దిగి, ప్రస్తుతం నీ సమయం ముగిసిందని యంగ్‌కి సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీప్లేలలో బంతి లెగ్-స్టంప్ నుంచి నిష్క్రమించిందని, విల్ యంగ్ నాటౌట్ అని స్పష్టంగా తెలిస్తోంది. కానీ, అంపైర్ వీరేంద్ర శర్మ తప్పుడు నిర్ణయానికి న్యూజిలాండ్ ఓపెనర్ బలయ్యాడు.

మూడో రోజు కూడా అంపైర్‌తో వాగ్వాదం.. గ్రీన్ పార్క్ టెస్టు మూడో రోజు రవిచంద్రన్ అశ్విన్ అద్వితీయ బౌలింగ్ యాక్షన్ పై వివాదం నెలకొంది. కేన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చిన తర్వాత, అశ్విన్ తన యాక్షన్ మార్చాడు. రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అంపైర్ నితిన్ మీనన్ తన ఫాలో త్రూతో సంతృప్తి చెందని అశ్విన్‌కు అంతరాయం కలిగించాడు.

దీని తర్వాత, అశ్విన్ అంపైర్ మీనన్‌తో బౌలింగ్ యాక్షన్ విషయంలో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో, అంపైర్ మాట్లాడుతూ, మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా వస్తున్నారు. నేను ఎల్‌బీడబ్ల్యూ ఎలా చూస్తానంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం అశ్విన్.. మీరు ఎలాగైనా ఔట్ ఇవ్వడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ సమయంలో రాహుల్ ద్రవిడ్ కూడా మ్యాచ్ రిఫరీ క్యాబిన్ వైపు పరిగెత్తడం కనిపించింది.

టామ్ లాథమ్ ఔట్ విషయంలోనూ.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో, అశ్విన్ వేసిన బంతి లాథమ్ ప్యాడ్‌కు తగిలి, అశ్విన్ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ నితిన్ మీనన్ దానిని నాటౌట్ అని పిలిచాడు. టీమిండియా DRS తీసుకోలేదు. అంపైర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంటే లాథమ్‌ ఔట్‌ అయ్యాడని రీప్లేలో తేలింది. ఈ నిర్ణయంతో అశ్విన్ కూడా చిరాకు పడ్డాడు. తొలి టెస్టులో అంపైర్ ఇచ్చిన 7 నిర్ణయాలను డీఆర్‌ఎస్‌తో భర్తీ చేసినట్లు మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ చోప్రా చెప్పాడు.

పటిష్ట స్థితిలో టీమిండియా.. కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది . 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టుకు తొలి దెబ్బ తగిలింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 1 వికెట్ నష్టానికి 4 పరుగులు చేసంది. టామ్ లాథమ్ 2, విలియం సోమర్‌విల్లే 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 234/7 స్కోరు వద్ద టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

సాహా, అయ్యర్‌ల హాఫ్‌ సెంచరీలు.. వృద్ధిమాన్‌ సాహా మెడ నొప్పి కారణంగా వికెట్‌ కీపింగ్‌ చేయలేదు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగి 115 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసి, టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపేందుకు తనవతం సహాయం చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతనికిది ఆరో అర్ధశతకంకాగా, న్యూజిలాండ్‌పై మూడోది. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత ఫామ్‌ను కొనసాగించి 109 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయ్యర్‌ను సౌతీ 65 పరుగుల వద్ద ఔట్ చేశాడు.

Also Read: Wriddiman Saha: మెడ నొప్పి వేధిస్తున్నా నిలబడిన సాహా.. ట్విట్టర్లో ప్రశంసలు..

IND vs NZ: శుభ్‎మన్ గిల్‌ ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి.. అతడు మిడిల్ ఆర్డర్‎లో రావాలి..