Wriddiman Saha: మెడ నొప్పి వేధిస్తున్నా నిలబడిన సాహా.. ట్విట్టర్లో ప్రశంసలు..
తనపై వస్తోన్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాడుటీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న
తనపై వస్తోన్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాడుటీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. టీమిండియా 105 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి అడుగుపెట్టిన వృద్ధిమాన్ 126 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 61 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు. తద్వారా టీమిండియాను ఇబ్బందుల నుంచి తప్పించడమే కాకుండా భారీ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా శ్రేయస్ అయ్యర్(65)తో ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన అతను…ఆతర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి 8 వికెట్‌కు మరో 67 పరుగులు జత చేశాడు. దీంతో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది.
ఆటతీరుతోనే సమాధానం.. కాగా సాహాకు టెస్టుల్లో ఇది ఆరో అర్ధ సెంచరీ. అతను టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. 2017లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాహా చివరిసారిగా అర్ధ సెంచరీ సాధించాడు. అప్పటినుంచి ఆడిన 11 టెస్టుల్లో ఒక్క సారి కూడా హాఫ్ సెంచరీ మార్కుకు చేరుకోలేకపోయాడు. దీంతో చాలామంది అతనిపై విమర్శల వర్షం కురిపించారు. జట్టు నుంచి తొలగించాలన్నారు. అలాంటి విమర్శలకు తన ఆటతీరుతోనే సమాధానం చెప్పాడు సాహా. కాగా 37 ఏళ్ల సాహా మెడ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయడం విశేషం. దీంతో నెటిజన్లు అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గాయంతో మూడో రోజు అతను పూర్తిగా డగౌట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా కివీస్ ముందు 283 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. ఆట ఐదోరోజులో కివీస్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు తీయాలి.
Wriddhiman Saha fighting through pain. Fully deserves a half-century in Kanpur. He has fully taken the game away from #NewZealand, along with #ShreyasIyer #INDvNZ #CricketTwitter #TeamIndia pic.twitter.com/GzVDdnFrhq
— The Game Changer (@TheGame_26) November 28, 2021
Also Read:
రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్ ఆటగాడు చేయలని ఫీట్ సాధించాడు..
Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!