IND vs NZ 1st Test, Day 4: నాలుగో రోజు ముగిసిన ఆట.. 234 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్..
IND vs NZ 1st Test, Day 4: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు సెకండ్
IND vs NZ 1st Test, Day 4: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆట మందకొడిగా కొనసాగింది.14 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్ 234 పరుగులకు డిక్లేర్ చేసింది. మూడోరోజు 63 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్‌కి మొత్తం 284 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా కొనసాగింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికి చటేశ్వరా పూజారా 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ అజింకా రహానె అజాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా ఔటయ్యాడు.
ఈ క్రమంలో తొలిటెస్ట్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యార్ క్లాసిక్ ఆటతో అందరిని అలరించాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. జట్టు స్కోరుని ముందుకు తీసుకెళ్లాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 65 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం అశ్విన్ 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్ సాహా కూడా చెలరేగిపోయాడు. హాప్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్సర్ పటేల్ 28 పరుగులతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు, జెమిసన్ 3 వికెట్లు, అజాజ్ పటేల్1 వికెట్ సాధించారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టామ్ లాథమ్ 95 పరుగులు, విల్ యంగ్ 89 పరుగులతో రాణించగా మిగతా వారు చాలా తక్కువ స్కోరుకు పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బగొట్టాడు. ఇక అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చేరో వికెట్ పడగొట్టారు.