AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన భారత్.. న్యూజిలాండ్ టార్గెట్‌ 284 పరుగులు

IND vs NZ: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట మందకొడిగా కొనసాగింది.

IND vs NZ: ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన భారత్.. న్యూజిలాండ్ టార్గెట్‌ 284 పరుగులు
Saha
uppula Raju
|

Updated on: Nov 28, 2021 | 4:57 PM

Share

IND vs NZ: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట మందకొడిగా కొనసాగింది. మూడో రోజు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి భారత్ 14 పరుగులు చేసి 63 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అయితే నాలుగో రోజు భారత్‌ ఏడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్ ఆట నిలకడగా కొనసాగింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికి చటేశ్వరా పూజారా 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ అజింకా రహానె అజాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్‌ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలిటెస్ట్ ఆడుతున్న శ్రేయాస్‌ అయ్యార్ క్లాసిక్‌ ఆటతో అందరిని అలరించాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం అశ్విన్ 32 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్‌ సాహా హాఫ్ సెంచరీ చేశాడు. 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అక్సర్ పటేల్‌ 28 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌కి 284 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది.

Viral News: బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు

Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలని లేఖ!

TDP YCP MPs In Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసిపి, టీడీపీ ఎంపీలు.