TDP YCP MPs In Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు.

TDP YCP MPs In Delhi: తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఉదయం లేచింది మొదలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకునే టీడీపీ, వైసీపీ...

TDP YCP MPs In Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు.
Ycp And Tdp Mp At Delhi
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2021 | 4:49 PM

TDP YCP MPs In Delhi: ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతూ పొలిటికల్ హీట్ ను పెంచుతూనే ఉంటాయి. ఇక తాజాగా అధికార పార్టీ వైసీపీ నేతలకు ప్రతి పక్ష పార్టీ టీడీపీ నేతలకు మధ్య జరుగుతన్న మాటల యుద్ధం అందరికీ తెలిసిందే.. ఏకంగా అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వారి నడవడికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీరు పెడుతూ మరీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే కూడా టీడీపీ నేతలకు ధీటుగా సమాధానం చెబుతూ ఏపీలో హాట్ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

ఉదయం లేచింది మొదలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకునే టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒక్కచోట చేరారు. ఒకరితో ఒకరు ఆహ్లాదకరంగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు కలిసి ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ భవన్ మీడియా పాయింట్ వద్ద కలిశారు. విజయ సాయి రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు తదితరులు ఒకరితో ఒకరు నవ్వుతు మాట్లాడుకున్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు.. శాశ్వత మిత్రులందరూ అని అంటారు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ నేతలు తమ పార్టీ కండువానీ తీసేస్తే.. అతను ఏపార్టీకి చెందిన వ్యక్తి అనేది వెంటనే చెప్పడం కొంచెం కష్టమేనని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కూడా..

Also Read:  మళ్ళీ నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు