IND vs NZ: శుభ్‎మన్ గిల్‌ ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి.. అతడు మిడిల్ ఆర్డర్‎లో రావాలి..

కాన్పూర్‎లో జరుగుతున్న టెస్ట్‎లో రెండో ఇన్నింగ్స్‎లో యువ ఓపెనర్ శుభ్‎మన్ గిల్ ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే అతడు రెండు ఇన్నింగ్స్‌‎ల్లో జేమీసన్ బౌలింగ్‎లోనే ఔటయ్యాడు. గిల్ ఔటైన తీరుపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు.....

IND vs NZ: శుభ్‎మన్ గిల్‌ ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి.. అతడు మిడిల్ ఆర్డర్‎లో రావాలి..
Gill
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 28, 2021 | 1:56 PM

కాన్పూర్‎లో జరుగుతున్న టెస్ట్‎లో రెండో ఇన్నింగ్స్‎లో యువ ఓపెనర్ శుభ్‎మన్ గిల్ ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే అతడు రెండు ఇన్నింగ్స్‌‎ల్లో జేమీసన్ బౌలింగ్‎లోనే ఔటయ్యాడు. గిల్ ఔటైన తీరుపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. గిల్‎లో లోపాన్ని ఎత్తి చూపాడు. లోపాన్ని సరిదిద్దుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. గిల్‌ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకోవాలని పఠాన్ సూచించాడు. గిల్ ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉందని. ఆ బంతులను అతడు ఎదరుర్కొంటే చాలు.. తిరుగు ఉండదని ఇర్ఫాన్ అన్నాడు. గిల్ అవుటైన విధానం గమనిస్తే.. అతడి రెండు పాదాలు ఒకే చోట ఉన్నాయని.. అందుకే బ్యాట్‌తో బంతిని ఆపేందుకు సమయం పట్టిందని విశ్లేషించాడు. అతని బ్యాట్, ప్యాడ్ మధ్య పెద్ద గ్యాప్ ఉందన్నాడు.

“ఇది అస్సలు సులభం కాదు. లైట్లు ఆన్‌లో ఉన్నాయి, బంతి కదులుతుంది.మీరు బయటకు వెళ్లకుండా వెనక్కి వెళ్లాలని మీకు తెలుసు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సాధారణంగా ఒత్తిడి కారణంగా ఔట్ అవుతారు. అయితే శుభ్‌మాన్ గిల్ తన టెక్నిక్‌పై ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలను బాగా ఎదుర్కొవాలి. ”అని పఠాన్ చెప్పాడు.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్నందున, గిల్ మిడిల్ ఆర్డర్‌లో సర్దుబాటు చేయవలసి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రంలో సెంచరీ చేసినప్పటి నుంచి ఇది గ్యారెంటీ స్పాట్ కానప్పటికీ, అతను బ్యాటింగ్ చేస్తే అతని ప్రతిభ బయటపడుతుందని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. “నేను అతను ఆడటం చూసినప్పుడల్లా, అతను టెస్ట్ ఓపెనర్ లాగా కనిపించడు. నాకు. అతను లైన్ లోపల ఆడే విధానం, బయటి అంచు, లోపలి అంచు రెండూ బహిర్గతమవుతాయి. నా అభిప్రాయం ప్రకారం, అతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్” అని చోప్రా పేర్కొన్నాడు.

Read Also.. MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కొనసాగిస్తుంది.. మాజీ పేసర్ సైమన్ డౌల్..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?