రిటైర్మెంట్‌కు సిద్ధమైన యూనివర్సల్ బాస్.. షెడ్యూల్ సిద్ధం.. చివరి మ్యాచ్‌ ఎక్కడ ఆడనున్నాడంటే?

Chris Gayle: ICC T20 వరల్డ్ కప్-2021 సమయంలో క్రిస్ గేల్ తన చివరి మ్యాచ్‌ని తన ఇంటి ప్రేక్షకుల ముందు ఆడాలనే కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రిటైర్మెంట్‌కు సిద్ధమైన యూనివర్సల్ బాస్.. షెడ్యూల్ సిద్ధం.. చివరి మ్యాచ్‌ ఎక్కడ ఆడనున్నాడంటే?
Chris Gayle

West Indies Cricket Team: వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, ప్రపంచంలోనే మైదానంలో సిక్సుల వర్షం కురిపించే బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఇటీవల స్వదేశంలో తన చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు గేల్ తన కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 42 ఏళ్ల గేల్ కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. క్రికెట్ వెస్టిండీస్ ఈ మేరకు గేల్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. క్రిక్‌బజ్ వెబ్‌సైట్ తన నివేదికలో ఈ సమాచారాన్ని పేర్కొంది. వెబ్‌సైట్ కరేబియన్ బోర్డ్ ఛైర్మన్ రికీ స్కెరిట్‌ మాట్లాడుతూ.. “మేం గేల్ కోరికను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది మంచి ఆలోచన. టైమింగ్, ఫార్మాట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనవరిలో ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్ గేల్ చివరి మ్యాచ్ అని CWI CEO జానీ గ్రేవ్ సూచించాడు.

“జనవరి రెండవ వారంలో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడతాం. దీని తర్వాత సబీనా పార్క్‌లో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులను అనుమతించినట్లయితే గేల్‌కు అతని ఇంటి వద్ద వీడ్కోలు పలికేందుకు ఈ మ్యాచ్ ఉత్తమ అవకాశంగా ఉంటుందని భావిస్తున్నాను. అయితే ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ గేల్‌కు చివరి మ్యాచ్‌ కాగలదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని రికీ స్పష్టం చేశాడు. సీఈవో ఇచ్చిన ప్రకటనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ఆయన వాపోయారు.

వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2021లో స్వదేశంలో తన చివరి మ్యాచ్ ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు. “నేను నా రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. కానీ, జమైకాలో నా ఇంటి ప్రేక్షకుల ముందు ఆడే అవకాశం ఇస్తే, నేను ధన్యవాదాలు చెప్పగలను” అని గేల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ తరఫున గేల్ 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గేల్ టెస్టుల్లో 7214 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,480 పరుగులు చేశాడు. టీ20లో 1899 పరుగులు సాధించాడు.

2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఇదే తన చివరి ప్రపంచకప్‌ అని గేల్‌ పేర్కొన్నాడు. కానీ, తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 14 ఆగస్టు 2019న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 5 సెప్టెంబర్ 2014న బంగ్లాదేశ్‌తో కింగ్‌స్టౌన్‌లో టెస్టుల్లో తన చివరి మ్యాచ్ ఆడాడు.

Also Read: Watch Video: ఈ అంపైర్ చాలా లక్కీ.. రెండోసారి తృటిలో తప్పిన ప్రమాదం..! వైరలవుతోన్న వీడియో

Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!

Click on your DTH Provider to Add TV9 Telugu