Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత బ్యాటింగ్ తడబడింది. ఆ జట్టు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు మరోసారి ఫ్లాప్‌ అయ్యారు.

Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!
Rahane Pujara Trolls
Follow us
Venkata Chari

|

Updated on: Nov 28, 2021 | 12:49 PM

Rahane- Pujara Trolls: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత బ్యాటింగ్ తడబడింది. ఆ జట్టు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు మరోసారి ఫ్లాప్‌ అయ్యారు. పుజారా (22) జైమీసన్ వేసిన బంతిని వికెట్ కీపర్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చాడు. గత 40 ఇన్నింగ్స్‌ల్లో పుజారా సెంచరీ చేయలేదు. అతను తన చివరి టెస్ట్ సెంచరీని 3 జనవరి 2019న ఆస్ట్రేలియాపై సాధించాడు.

అదే సమయంలో కెప్టెన్ అజింక్యా రహానె (4) అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఈ ఏడాది రహానే 12 మ్యాచ్‌లు ఆడి 411 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని సగటు 19.57గా నిలిచింది. అతని బ్యాట్‌ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. 2021లో అతని బ్యాట్ నుంచి కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల నిరంతర పేలవ ప్రదర్శనతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. నెటిజన్లు వీరిపై చాలా కోపంగా ఉన్నారు.

Also Read: IND vs NZ, live, 1st Test, Day 4: ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. అశ్విన్ (32) ఔట్

IND vs NZ: ఈ మంత్రమే నన్ను నడిపిస్తోంది.. మీరూ అలాగే ఉండండి: వీడియో పంచుకున్న టీమిండియా సారథి కోహ్లీ