Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌ను ఢిల్లీ వదులుకుంటుందా.. కొత్త ఫ్రాంఛైజీలు అతడిని తీసుకుంటాయా..
త్వరలో ఐపీఎల్-2022 మెగా వేలం జరగనుంది. అయితే ఆలోపు ప్రస్తుత ప్రాఛైజీలు ఎవరిని రిటైన్ చేసుకుంటాయో అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి...
త్వరలో ఐపీఎల్-2022 మెగా వేలం జరగనుంది. అయితే ఆలోపు ప్రస్తుత ప్రాఛైజీలు ఎవరిని రిటైన్ చేసుకుంటాయో అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జ్టేను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని మాజీ మహిళ క్రికెటర్ అంజుమ్ చోప్రా అన్నారు. శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులో ఉంచుకునే అవకాశం లేదని అభిప్రాయపడింది. అయ్యర్ 2015లో ఢిల్లీ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్)లో చేరాడు. వేలంలో అతడు 2.6 కోట్లకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యాడు.
2019లో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. 2020లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ వారు ముంబై చేతిలో ఓడిపోయారు. అయ్యర్ 86 ఇన్నింగ్స్‌లలో 16 అర్ధ సెంచరీలతో 31.7 సగటుతో 1916 పరుగులు చేశాడు.ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ODI సిరీస్‌లో భుజం గాయం కారణంగా అతను IPL 2021 మొదటి దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో పంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ రెండో దశలో అయ్యర్ జట్టులో చేరాడు.
వచ్చే రెండు కొత్త ఫ్రాంఛైజీలు అయ్యర్ తీసుకుని కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు అంజుమ్ చెప్పారు. ఆర్సీబీకి ప్రస్తుతం కెప్టెన్ లేడు. కాబట్టి అతను ఏదైనా జట్టుకు కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అడుగుపెట్టబోతుంది అహ్మదాబాద్. దీంతో వారికి కెప్టెన్‌తో పాటు మంచి బ్యాటర్ కావాల్సి ఉంది. అలాంటి వారికి శ్రేయస్ గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ గణాంకాల్ని దృష్టిలో పెట్టుకుని అతడిని వారి జట్టులోకి ఆహ్వానించేందుకు అహ్మదాబాద్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also.. India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. బీసీసీఐతో ఏం చెప్పిందంటే?