AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 1st Test, Day 4 Highlights: లక్ష్యం 284 పరుగులు.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 296 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

IND vs NZ, 1st Test, Day 4 Highlights: లక్ష్యం 284 పరుగులు.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
Ind Vs Nz, Live, 1st Test, Day 4
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 19, 2022 | 6:49 PM

Share

IND vs NZ Live Score: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు నాలుగో రోజు. మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 345 పరుగులకు మించి న్యూజిలాండ్‌ను చేరుకోనివ్వలేదు. కేవలం 296 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 49 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 పరుగులు చేసి 63 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అయితే శుభ్‌మన్ గిల్ వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.

నాలుగో రోజు భారత్‌ ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌ 3 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్ ఆట నిలకడగా కొనసాగింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికి చటేశ్వరా పూజారా 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ అజింకా రహానె అజాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్‌ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలిటెస్ట్ ఆడుతున్న శ్రేయాస్‌ అయ్యార్ క్లాసిక్‌ ఆటతో అందరిని అలరించాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం అశ్విన్ 32 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్‌ సాహా హాఫ్ సెంచరీ చేశాడు. 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అక్సర్ పటేల్‌ 28 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌కి 284 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Nov 2021 04:48 PM (IST)

    నాలుగో రోజు ముగిసిన ఆట

    నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 234 పరుగులకు డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్‌కి 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విల్‌యంగ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే రీప్లేలో ఇది నాటౌట్‌గా తేలింది. దీంతో కివీస్‌ నాలుగోరోజు ఒక వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.

  • 28 Nov 2021 04:46 PM (IST)

    విల్‌ యంగ్‌ నాటౌట్‌ అని తేలింది..

    అశ్విన్ అప్పీల్‌తో ఏకీభవించిన అంపైర్ ఔట్‌ ఇచ్చాడు. విల్ రివ్యూ తీసుకోవాలనుకున్నాడు. కానీ లాథమ్‌ మద్దతు లభించలేదు. అప్పటికే సమయం కూడా మించిపోయింది. కానీ రీప్లేలో బంతి స్టంప్‌ల మీదుగా వెళుతున్నట్లు కనిపించింది. యంగ్ నాటౌట్‌ అని తేలింది.

  • 28 Nov 2021 04:34 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కివీస్‌

    కివీస్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో విల్‌యంగ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో కివీస్‌ 3 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.

  • 28 Nov 2021 04:32 PM (IST)

    బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్

    న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లుగా విలియమ్ సోమర్ విల్లే, విల్‌ యంగ్‌ క్రీజులోకి వచ్చారు.

  • 28 Nov 2021 04:18 PM (IST)

    భారత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌.. న్యూజిలాండ్‌ లక్ష్యం 284 పరుగులు

    భారత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు డిక్లేర్ చేసింది. వృద్దిమాన్‌ సాహ 61 పరుగులు, అక్సర్ పటేల్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో న్యూజిలాండ్ లక్ష్యం 284 పరుగులు

  • 28 Nov 2021 04:09 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన వృద్ధిమాన్‌ సాహ

    భారత ప్లేయర్‌ వృద్దిమాన్‌ సాహ హాప్‌ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అక్సర్‌ పటేల్‌ 28 పరుగులతో అండగా నిలిచాడు. దీంతో భారత్‌.. న్యూజిలాండ్ కంటే 283 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 28 Nov 2021 03:35 PM (IST)

    200 పరుగులు దాటిన భారత్‌

    భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు దాటింది. వృద్ధిమాన్‌ సాహా 45 పరుగులు, అక్సర్‌ పటేల్‌ 14 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. దీంతో భారత్‌ ఆధిక్యం 253 పరుగులు దాటింది.

  • 28 Nov 2021 02:17 PM (IST)

    అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్లు..

    187 శిఖర్ ధావన్ vs AUS, మొహాలి 2012/13 177 రోహిత్ శర్మ vs WI ​​కోల్‌కతా 2013/14 170 శ్రేయ్స్ అయ్యర్ vs NZ కాన్పూర్ 2021/22 156 లాలా అమర్‌నాథ్ vs ENG, ముంబై 1933/34

  • 28 Nov 2021 02:15 PM (IST)

    హాఫ్ సెంచరీ హీరో శ్రేయాస్ అయ్యర్ ఔట్..

    సౌతీ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (65) పెవిలియన్ చేరాడు. దీంతో 167 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 216 పరుగులకు చేరింది.

  • 28 Nov 2021 01:57 PM (IST)

    అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ సాధించిన ప్లేయర్లు..

    దిలావార్ హుస్సేన్ 59 & 57 vs ఇంగ్లండ్, కోలకతా 1933/34 సునీల్ గవాస్కర్ 65 & 67 స్పెయిన్ * vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 1970/71 శ్రేయాస్ అయ్యర్ 105 & 50 * vs కివీస్, కాన్పూర్ 2021/22

  • 28 Nov 2021 01:55 PM (IST)

    తొలి భారతీయుడిగా శ్రేయాస్ రికార్డు..

    శ్రేయాస్ అయ్యర్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 10వ ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

  • 28 Nov 2021 12:45 PM (IST)

    మొదటి నాలుగు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు vs భారత్

    22 కైల్ జేమీసన్ * 21 డారిల్ టఫీ 20 రిచర్డ్ హ్యాడ్లీ/ క్రిస్ మార్టిన్ 18 బ్రూస్ టేలర్

  • 28 Nov 2021 12:43 PM (IST)

    ఆరో వికెట్‌ డౌన్..

    జైమిసన్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (32) పెవిలియన్ చేరాడు. దీంతో 51 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 152 పరుగులకు చేరింది. జైమిసన్ కీలక భాగస్వామ్యానని బ్రేక్ చేశాడు.

  • 28 Nov 2021 12:35 PM (IST)

    50 పరుగుల భాగస్వామ్యం

    కీలక ఇన్నింగ్స్‌ ఆడుతోన్ అశ్విన్ (31), అయ్యర్ (25).. 50 పరుగుల భాతస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. దీంతో టీమిండియా ఆధిక్యం 150 పరుగులు దాటింది. టీమిడియా ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

  • 28 Nov 2021 11:41 AM (IST)

    లంచ్ బ్రేక్..

    లంచ్ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. అశ్విన్ 20, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 33 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

  • 28 Nov 2021 10:47 AM (IST)

    ఐదో వికెట్‌ డౌన్..

    సౌతీ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (17), జడేజా(0) పరుగుల వద్ద వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 51 పరుగుల వద్ద భారత్ నాలుగు, ఐదు వికెట్లను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 100 పరుగులకు చేరింది. అయితే వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా కష్టాల్లో కూరకపోతోంది. భారీ ఆధిక్యం సాధింస్తుందా లేదో చూడాలి.

  • 28 Nov 2021 10:44 AM (IST)

    నాలుగో వికెట్‌ డౌన్..

    సౌతీ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (17) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 51 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 100 పరుగులకు చేరింది. అయితే వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా కష్టాల్లో కూరకపోయింది. భారీ ఆధిక్యం సాధించడంపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేలా ఉంది.

  • 28 Nov 2021 10:21 AM (IST)

    మూడో వికెట్‌ డౌన్..

    అజాజ్ బౌలింగ్‌లో రహానే(4) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 41 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 90 పరుగులకు చేరింది.

  • 28 Nov 2021 10:03 AM (IST)

    రెండో వికెట్‌ డౌన్..

    జౌమిసన్ బౌలింగ్‌లో పుజరా(22) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 32 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. మొత్తంగా టీమిండియా ఆధిక్యం 81 పరుగలకు చేరింది.

  • 28 Nov 2021 09:41 AM (IST)

    మొదలైన నాలుగో రోజు ఆట..

    నాలుగో రోజు ఆట మొదలైంది. మయాంక్ అగర్వాల్ 8, పుజరా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట మొదలైన తొలి ఓవర్‌లోనే తలో బౌండరీ బాదేశారు.

  • 28 Nov 2021 09:30 AM (IST)

    IND vs NZ: మ్యాచ్ ప్రారంభానికి ముందు..

  • 28 Nov 2021 09:28 AM (IST)

    కైల్ జైమిసన్, టిమ్ సౌథీ మాయ చేసేందుకు రెడీ..

    ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్ల కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చాలా ఇబ్బందులు పడింది. వీరిద్దరూ స్పిన్నర్లు కాదు.. ఫాస్ట్ బౌలర్లు. టిమ్ సౌథీ ఐదు వికెట్లు, కైల్ జేమ్సన్ మూడు వికెట్లు తీశారు. జైమిసన్ మూడో రోజు భారత్‌‌ను గట్టి దెబ్బ తీశాడు. అయితే, ఈ పిచ్ నెమ్మదించింది. దీనిపై బౌన్స్ లేదు. కానీ, ఈ పిచ్‌పై వీరిద్దరూ భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల నాలుగో రోజు కూడా భారత్ ఈ ఇద్దరు బౌలర్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

  • 28 Nov 2021 09:28 AM (IST)

    పుజారా, మయాంక్‌లకు అవకాశం..

    నాలుగో రోజు అందరి దృష్టి మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారాలపైనే ఉంది. ఈ ఇన్నింగ్స్ ఇద్దరికీ భారీ అవకాశాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. పుజారా పరుగుల కోసం పోరాడుతున్నాడు. అతని ఖాతాలో పరుగులేమీ లేకపోవడంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం తర్వాత పుజారా ఔటయ్యాడు. పుజారాకు ఇది మరో అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. అదే సమయంలో, మయాంక్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు.

  • 28 Nov 2021 09:28 AM (IST)

    న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతాలు చేస్తారా?

    భారత జట్టు న్యూజిలాండ్‌పై భారీ స్కోరు సాధించి పెద్ద ఆధిక్యాన్ని పొందాలని కోరుకుంటుంది. అయితే న్యూజిలాండ్ జట్టు వీలైనంత త్వరగా భారత్‌ను అడ్డుకోవాలని కోరుకుంటుంది. దాంతో తక్కువ టార్గెన్‌ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  • 28 Nov 2021 09:28 AM (IST)

    మయాంక్-పుజారా జోడీపై భారీ ఆశలు

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు నాలుగో రోజు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ త్వరగానే వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారాపై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. ఈ జోడీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు భారీ స్కోరుకు పునాది వేయాలని కోరుకుంటోంది

Published On - Nov 28,2021 9:22 AM