Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఈ మంత్రమే నన్ను నడిపిస్తోంది.. మీరూ అలాగే ఉండండి: వీడియో పంచుకున్న టీమిండియా సారథి కోహ్లీ

Mumbai Test: T20 వరల్డ్ కప్ 2021 తరువాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో జాయిన్ కానున్నాడు. అందుకే తొలి టెస్టును అజింక్య రహానే ముందుండి నడిపిస్తున్నాడు.

IND vs NZ: ఈ మంత్రమే నన్ను నడిపిస్తోంది.. మీరూ అలాగే ఉండండి: వీడియో పంచుకున్న టీమిండియా సారథి కోహ్లీ
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 28, 2021 | 9:07 AM

India Vs New Zealand 2021: డిసెంబర్ 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాంఖడేలో ఐదేళ్ల నిరీక్షణ తర్వాత టెస్ట్ క్రికెట్ తిరిగి రావడం ఇదే మొదటి సారి. రెండవది, ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. మూడో కారణం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ.. ఇలా ఎన్నో అంశాలతో రెండో టెస్ట్ ముడిపడి ఉంది. 23 నవంబర్ 2019న బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో సెంచరీ సాధించినప్పటి నుంచి కోహ్లి 100 మార్కును దాటలేకపోయాడు. ఈ నిరీక్షణకు ముగింపు పలికేందుకు కెప్టెన్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

టీ20 ప్రపంచకప్ 2021లో టీమ్ ఇండియా ప్రయాణం ముగిసిన తరువాత విరాట్ కోహ్లీ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తోపాటు మొదటి టెస్టులోనూ ఆడలేదు. అయితే కోహ్లి విశ్రాంతితో పాటు తన సన్నాహాలకు మరింత ప్రాధాన్యతనిస్తూ కనిపించాడు. భారత కెప్టెన్ శనివారం తన సోషల్ మీడియా ఖాతాలలో కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకున్నాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం కొత్తమీ కాదు. ఇంతకుముందు కూడా కోహ్లి ఇలా చాలా సార్లు చేశాడు. అయితే ఈ వీడియోతో కోహ్లీ పోస్ట్ చేసిన సందేశం చాలా ప్రత్యేకంగా ఉంది.

విజయ మంత్రాన్ని వెల్లడించిన విరాట్ కోహ్లీ.. తన సుదీర్ఘ కెరీర్‌లో, విరాట్ కోహ్లీ తనను తాను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా మారడానికి తీవ్రంగా కృషి చేస్తానని పేర్కొన్నాడు. అది బ్యాటింగ్ ప్రాక్టీస్ అయినా లేదా జిమ్‌లో వర్కౌట్ అయినా సరే. మిమ్మల్ని మీరు ఫిట్‌గా, మెరుగైన ఆకృతిలో ఉంచుకోండి అంటూ తెలిపాడు. భారత కెప్టెన్ ట్యాగ్‌కు ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు డెంజాల్ వాషింగ్టన్ కూడా ఒక కోట్‌ను పంచుకున్నారు. “కష్టపడి పని చేయడం కంటే పురోగతికి ఏముంటుంది.” కోహ్లీ పంచుకున్న ఈ క్యాప్షన్ ఎంతమందికో ప్రేరణగా నిలిచిందంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

ఫిట్‌నెస్ విషయంలో సీరియస్.. కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై చాలా సీరియస్‌గా ఉన్నాడు. అలాగే తన తోటి టీమ్ ఇండియా ఆటగాళ్లలో ఫిట్‌నెస్ స్ఫూర్తిని కూడా నింపుతుంటాడు. దాని ఫలితం గత కొన్నేళ్లుగా మైదానంలో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శన రూపంలో చూపుతోంది. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి కోహ్లీ చాలా హార్డ్ వర్కవుట్‌లు చేస్తుంటాడు. ఇతరులను కూడా ఫిట్‌గా ఉండేలా ప్రేరేపిస్తాడు. ఈ వీడియో స్పష్టంగా అతని అభిమానులను సంతోషపెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కోహ్లీ అభిమానులు డిసెంబర్ 3 న నిజమైన ఆనందాన్ని పొందేందుకు వెయిట్ చేస్తున్నారు. కోహ్లీ తన 71వ సెంచరీ కోసం వారంతా వేచి చూస్తున్నారు. ఈ విశ్రాంతిలో మ్యాచ్‌కు సిద్ధంగా ఉండటానికి కోహ్లీ పడిన కష్టానికి మంచి ఫలితాలు వస్తాయని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: IND vs NZ, Mumbai Test: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర.. రెండో టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం..!

IND vs NZ: కాన్పూర్‌లో అక్షర్ విధ్వంసం.. 7 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు.. దిగ్గజాల సరసన చేరిన యంగ్ బౌలర్