AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. బీసీసీఐతో ఏం చెప్పిందంటే?

Indian Cricket Team: వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. డిసెంబర్ 17 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి.

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. బీసీసీఐతో ఏం చెప్పిందంటే?
Bcci
Venkata Chari
|

Updated on: Nov 28, 2021 | 7:50 AM

Share

Indian Cricket Team: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌తో హడలెత్తిపోతోంది. దీని కారణంగా ఆ దేశంలో వివిధ క్రీడా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. అనేక యూరోపియన్ దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలు కూడా నిషేధించారు. అదే సమయంలో విమానాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అయితే కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం దక్షిణాఫ్రికాకు టీమిండియా పర్యటనకు సంబంధించి ఖచ్చితంగా పెద్ద ప్రకటన అందించారు. టీమిండియాను దక్షిణాఫ్రికాకు పంపే ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఠాకూర్ అన్నారు. వచ్చే నెలలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల కోసం టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది.

కరోనా నాల్గవ తరంగం దక్షిణాఫ్రికాలో బీభత్సం చేస్తోంది. ఈ తరంగంలో వైరస్ కొత్త రూపం వచ్చింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఓమిక్రాన్’ అని పేరు పెట్టింది. దీనిని పెద్ద ముప్పుగా అభివర్ణించింది. దీని కారణంగా దక్షిణాఫ్రికాలో ఎలాంటి క్రీడా ఈవెంట్‌లు జరిగే అవకాశంలేదని తెలుస్తోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అక్కడ జరగాల్సిన జూనియర్ మహిళల ప్రపంచకప్‌ను వాయిదా వేసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వాయిదా పడింది.

భారత బృందాన్ని పంపే ముందు.. ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు డిసెంబర్ 8-9 తేదీల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. తాజా పరిస్థితుల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు భారత బోర్డు కొంత సమయం వరకు వేచి ఉన్నప్పటికీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత క్రీడా మంత్రి ఠాకూర్ మాత్రం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఠాకూర్ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడి, ఈ విషయంపై పెదవి విప్పారు.

‘బీసీసీఐ మాత్రమే కాదు, ప్రతి బోర్డు తమ జట్టును కొత్త కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న దేశాలకు పంపే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఇలాంటి ముప్పు ఉన్న దేశానికి జట్టును పంపడం సరికాదు. ఈ విషయంలో బీసీసీఐ మమ్మల్ని సంప్రదిస్తే, మేం పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు.

బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లకముందే ఓ భారత జట్టు అక్కడ పర్యటనలో ఉంది. దక్షిణాఫ్రికా-ఏతో 4-రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇండియా-ఏ జట్టు బ్లూమ్‌ఫోంటెయిన్‌లో ఉంది. ఇక్కడ ఇప్పటికే ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగింది. టీమ్ ఇండియాను దక్షిణాఫ్రికాకు పంపే ముందు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి, తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తోన్న భారత ఏ జట్టును మాత్ర ఇంకా రీకాల్ చేయలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Also Read: Junior Hockey World Cup: క్వార్టర్స్‌కు చేరిన భారత్.. చివరి మ్యాచ్‌లో పోలాండ్‌‌పై 8-2తేడాతో ఘన విజయం

ISL 2021: మోహన్ బగన్‌ అద్భుత ఆరంభం.. విజయం కోసం ఈస్ట్‌ బెంగాల్ ఎదురుచూపులు..!