MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కొనసాగిస్తుంది.. మాజీ పేసర్ సైమన్ డౌల్..

చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కొనసాగించే అవకాశం ఉందని న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అన్నారు. అయితే ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో సీఎస్‌కే కోసం మొత్తం సీజన్‌ను ఆడతాడో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు...

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కొనసాగిస్తుంది.. మాజీ పేసర్ సైమన్ డౌల్..
Dhoni
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 28, 2021 | 1:16 PM

చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కొనసాగించే అవకాశం ఉందని న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అన్నారు. అయితే ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో సీఎస్‌కే కోసం మొత్తం సీజన్‌ను ఆడతాడో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. IPL 2022 మెగా వేలానికి ముందుగా రిటైన్ చేయబడిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించడానికి IPL జట్లు నవంబర్ 30 తుది గడువుగా ఉంది. ప్రతి జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను తిరిగి తీసుకునే అవకాశం ఉంది.

ముగ్గురు స్థానిక ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. CSK కెప్టెన్ MS ధోనిని కొనసాగించే అవకాశం ఉంది, అయితే అతను వారి మొదటి ఎంపిక అవుతాడో లేదో చూడాలని డౌల్ పేర్కొన్నాడు. మొత్తం 8 జట్లకు గరిష్ఠ పర్స్ ఒక్కొక్కటి రూ. 90 కోట్లుగా నిర్ణయించబడింది. మెగా వేలం కోసం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే, టాప్ ప్లేయర్ రూ. 15 కోట్లతో మొత్తం రూ.42 కోట్లు వారి పర్సు నుంచి కట్ చేస్తారు.

ఎంఎస్ ధోని తాను పోటీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వలేదని, చెన్నైలో తన వీడ్కోలు ఆటను నిర్వహించాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. “కాబట్టి ఆశాజనక, నా చివరి T20, ఇది చెన్నైలో ఉంటుంది.” అని ఇటీవల చెన్నైలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో ధోని అన్నాడు. భారత మాజీ కెప్టెన్, బ్యాట్‌తో పెద్దగా స్కోర్ చేయనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభంలో CSKని 4వ IPL టైటిల్‌ అందించాడు. “MS ధోని తన చివరి గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీని తీసుకుంటాడు. అది నా ఆలోచన. MS ధోని పూర్తి సీజన్ ఆడతాడని నేను అనుకోను. ఫాఫ్ డు ప్లెసిస్ నుండి బాధ్యతలు స్వీకరిస్తారు” అని సైమన్ డౌల్ చెప్పాడు.

Read Also.. Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‎ను ఢిల్లీ వదులుకుంటుందా.. కొత్త ఫ్రాంఛైజీలు అతడిని తీసుకుంటాయా..Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!