- Telugu News Photo Gallery Cricket photos Shreyas is the first batsman to score century in 1st innings and 50 in 2nd innings in the debut match IND vs NZ
రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్ ఆటగాడు చేయలని ఫీట్ సాధించాడు..
Shreyas iyer: కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ అరంగేట్రం చేసాడు.
Updated on: Nov 28, 2021 | 5:53 PM

కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ అరంగేట్రం చేసాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేకమైన క్లబ్‌లో చేరాడు.

అయ్యర్ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. భారత్ తరఫున 16వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయ్యర్ మళ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 పరుగులు చేశాడు. దీంతో అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కి పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తరఫున దిలావర్ హుస్సేన్ తొలిసారి ఈ ఫీట్ సాధించాడు.1933-34లో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో దిలావర్ 59, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు.

తన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కి పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్. 1970-71లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై ఈ రికార్డ్ సాధించాడు. గవాస్కర్ తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో అయ్యర్ ఈ ఇద్దరి కంటే ఒక అడుగు ముందున్నాడు. అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాప్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు.





























