IND vs NZ, 1st Test, Day 5 Highlights: డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్ట్.. చివరి వికెట్ సాధించలేకపోయిన భారత్
India vs New Zealand: కాన్పూర్ టెస్ట్‌లో న్యూజిలాండ్ ముందు భారత్ 284 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో కివీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయింది.
IND vs NZ, Highlights, 1st Test, Day 5: కాన్పూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్ డ్రా గా ముగిసింది. చివరి రోజు బౌలర్లు పూర్తిగా శ్రమించారు. కాని ఆఖరి వికెట్ తీయలేకపోయారు. న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చివరగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రచిన రవీంద్ర, అజాజ్ పటేల్ భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ పేలవంగా ఆడింది. ఓపెనర్ టామ్ లాథన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. 52 పరుగులు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు.
విలియమ్ సోమర్ విల్లే 36 పరుగులు, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 24 పరుగులు చేశారు. క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డారు. వీరు మినహాయించి మిగతా వారు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లు ఆది నుంచి తమ ప్రతాపం చూపించారు. ఓవర్లు మెయిడన్ చేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు సాధించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు, అక్సర్ పటేల్ 1 వికెట్, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ సాధించారు.
LIVE NEWS & UPDATES
-
డ్రాగా ముగిసిన తొలి టెస్ట్
కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలిటెస్ట్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చివరగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రచిన రవీంద్ర, అజాజ్ పటేల్ భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. కానీ చివరి వికెట్ తీయలేకపోయారు.
-
4 వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా చివరి రోజు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కివీస్ బ్యాట్స్‌మెన్లను తన బంతులతో ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ భారత్‌ని విజయా తీరాలవైపు నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఇతని ఖాతాలో 4 వికెట్లు చేరాయి.
-
-
తొమ్మిదో వికెట్ కోల్పోయిన కివీస్
న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ 4 పరుగులకు వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కివీస్ 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత్ విజయానికి 1 వికెట్ దూరంలో ఉంది.
-
150 పరుగులు దాటిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి150 పరుగులు దాటింది. క్రీజులో రాచిన్ రవీంద్ర 10 పరుగులు, టిమ్ సౌథీ 0 పరుగులతో ఆడుతున్నారు. న్యూజిలాండ్ గెలవాలంటే 133 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కైల్ జెమిసన్ 5 పరుగులకు ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో కివీస్ 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. భారత్ విజయానికి 2 వికెట్ల దూరంలో ఉంది.
-
-
రివ్యూ కోల్పోయిన భారత్
ఇండియా రివ్యూ కోల్పోయింది. అశ్విన్ వేసిన 77 ఓవర్‌లో టామ్ బ్లండెల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడని కెప్టెన్ రహానె రివ్యూకి వెళ్లాడు. కానీ అది నాటౌట్‌గా తేలింది. దీంతో భారత్ రివ్యూని కోల్పోయింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
కివీస్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ బ్లండెల్ 2 పరుగులకు ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 146 పరుగుల దూరంలో ఉంది. చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
-
వరుసగా 3 ఓవర్లు మెయిడిన్
బౌలర్లు విజృంభిస్తున్నారు. వరుసగా 3 ఓవర్లు మెయిడిన్ చేశారు. భారత్ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. కివీస్ వికెట్ కాపాడుకోవడానికి చాలా కష్టపడుతోంది. 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 153 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రాచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్ ఉన్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విలియమ్‌సన్ 24 పరుగులు ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో కివీస్ 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. హెన్నీ నికోల్స్ 1 పరుగుకే ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కివీస్ 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.
-
టీ బ్రేక్..
టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ టీం 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్ 24 పరుగులతో ఉన్నాడు. అలాగే కివీస్ ఈ టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 31.5 ఓవర్లో 159 పరుగులు చేయాల్సి ఉంది. భారత విజయానికి మరో 6 వికెట్లు కావాల్సి ఉంది.
-
నాలుగో వికెట్ డౌన్..
రాస్ టేలర్(2) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ విజయం సాధించాలంటే మాత్రం ఇంకా 31.5 ఓవర్లో 159 పరుగులు చేయాల్సి ఉంది. భారత విజయానికి మరో 6 వికెట్లు కావాల్సి ఉంది.
-
డ్రా దిశగా సాగుతోన్న తొలి టెస్ట్
తొలి టెస్టులో ఫలితం డ్రా దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు సెషన్స్‌ల్లోనూ కేవలం భారత బౌలర్లు 3 వికట్లు మాత్రమే పడగొట్టారు. దీంతో ఈ మ్యాచులో విజయం సాధించాలంటే కివీస్ మరో 159 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియాకు 7 వికెట్లు దక్కాల్సి ఉంది. ఈ రోజు ఆటలో ఇంకా 32 ఓవర్లే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ టెస్ట్‌లో ఫలితం తేలేలా కనిపించడం లేదు.
-
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
హాఫ్ సెంచరీ చేసిన టామ్ లాథం(52) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే మాత్రం ఇంకా 38 ఓవర్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. భారత విజయానికి మరో 7 వికెట్లు కావాల్సి ఉంది.
-
100 పరుగులు దాటిన న్యూజిలాండ్..
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ ఈ టెస్టును డ్రా దిశగా తీసుకెళ్తున్నారు. రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ టీం మరో 183 పరుగులు సాధిస్తేనే విజయం దక్కనుంది. క్రీజులో కేన్ విలియమ్సన్ 8, టామ్ లాథం 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కేవలం వికెట్లను కాపాడుకోవడంలో నిమగ్నమైన కివీస్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
-
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
లంచ్ తరువాత మొదటి బంతికే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విలియం సోమెర్విల్లే (36) రెండో వికెట్‌గా 79 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ దక్కింది. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే మాత్రం ఇంకా 203 పరుగలు చేయాల్సి ఉంది. భారత విజయానికి మరో 8 వికెట్లు కావాల్సి ఉంది.
-
లంచ్ బ్రేక్..
విలియమ్(36), టామ్ లాథం(35) అర్థ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. టీం స్కోర్‌ను 79 పరుగులు దాటించారు. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టెస్టులో కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 205 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌కు మరో 9 వికెట్లు దక్కాల్సి ఉంది. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
-
లక్ష్యం దిశగా సాగుతోన్న న్యూజిలాండ్..
విలియమ్(32), టామ్ లాథం(32) అర్థ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. టీం స్కోర్‌ను 70 పరుగులు దాటించి, టార్గెట్ వైపు దూసుకెళ్తున్నారు. ఈ టెస్టులో కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 214 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌కు మరో 9 వికెట్లు దక్కాల్సి ఉంది.
-
50 పరుగుల భాగస్వామ్యం..
నాలుగో రోజు చివర్లో విల్ యంగ్ వికెట్ కోల్పోయిన కివీస్ టీం.. ఐదో రోజును ధాటిగానే ఆరంభించింది. దీంతో విలియమ్(26), టామ్ లాథం(21) అర్థ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. అలాగే టీం స్కోర్‌ను కూడా 50 పరుగులు దాటించి, టార్గెట్ వైపు దూసుకెళ్తున్నారు. ఈ టెస్టులో కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 231 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌కు మరో 9 వికెట్లు దక్కాల్సి ఉంది.
Published On - Nov 29,2021 9:32 AM