IPL 2022 Mega Auction: ఆర్‌సీబీకి మొదలైన కష్టాలు.. ఉండేదెవరు.. వీడేదెవరు.. చిక్కుముడిగా మారిన సారథి ఎంపిక?
IPL 2022 Retention List: ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోగలవు. రిటెన్షన్ ఆటగాళ్ల గురించి సమాచారం ఇవ్వడానికి చివరి రోజు నవంబర్ 30గా పేర్కొన్న సంగతి తెలిసిందే.
IPL 2022 Mega Auction: మెగా వేలానికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు తమ తమ జట్లను ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా ఆటగాళ్ల నిలుపుదలపై చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు ప్రస్తుతం చాలా ఆసక్తిక ర పరిణామాలు నెలకొన్నాయి. తన పాత ఆటగాళ్లను కూడా నిలబెట్టుకోవాలి. ఐపీఎల్ 2021లో విరాట్ కోహ్లి ఆ పదవిని వదులుకున్నందున కొత్త కెప్టెన్‌ను కూడా నియమించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌తో పాటు ఈ రిటెన్షన్ గురించి కూడా జట్టు ఆలోచించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆర్సీబీ తన కెప్టెన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిందని సమాచారం. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోగలవు. నిలుపుదల గురించి సమాచారం ఇవ్వడానికి చివరి రోజు నవంబర్ 30గా బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక మేరకు, RCB IPL తదుపరి మూడు సీజన్‌లకు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌లను ఉంచుకోవచ్చు. అయితే ఆర్‌సీబీ కెప్టెన్‌ని ఇంకా నిర్ణయించలేదు. విరాట్ కోహ్లి ఇటీవల ఈ పదవిని వదిలిపెట్టినందున.. కొత్త కెప్టెన్ ఆర్‌సీబీకి సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2021 రెండో అర్ధభాగానికి ముందు కోహ్లి తాను ఇకపై కెప్టెన్‌గా ఉండనని, అయితే RCB తరపున ఆడాలని కోరుకుంటున్నానని తెలిపాడు. RCB తప్ప మరే ఇతర జట్టులో ఆడబోనని జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని ఆర్‌సీబీ అట్టిపెట్టుకోవడం ఖాయం. వీరికి ఎంత డబ్బు అందుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2018కి ముందు కోహ్లీని రిటైన్ చేసినప్పుడు మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే అధికంగా తీసుకునేవాడు. కోహ్లీ గతంలో రూ.17 కోట్లు తీసుకునేవాడు. అదే సమయంలో ఇతర జట్ల ఐకాన్ ప్లేయర్లకు రూ.16 కోట్లు వచ్చేవి.
RCB కెప్టెన్‌గా భారతీయుడేనా..! కెప్టెన్సీ రేసులో మ్యాక్స్‌వెల్ పేరు లేదు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్ పరిస్థితి విషమంగా ఉంది. సీజన్ మొత్తానికి విదేశీ కెప్టెన్ అందుబాటులో ఉండే సమస్య కూడా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా భారతీయుడు మాత్రమే కాగలడని తెలుస్తోంది. RCB మరొక ప్రముఖుడు ఏబీ డివిలియర్స్ కూడా ఇటీవల అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను కూడా ఇకపై అందుబాటులో ఉండడు. దీంతో సారథిగా ఎవరిని నియమిస్తారో ఆసక్తికరరంగా మారింది.
చాహల్, సిరాజ్, పడిక్కల్‌ల పరిస్థితి ఎటువైపు? ఆర్సీబీ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోనుందని సమాచారం. అయితే దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్ల పేర్లు కూడా రిటెన్షన్ కోసం వినిపిస్తున్నాయి. ఈ ఆటగాళ్లు గత కొన్ని సీజన్‌లుగా ఆర్‌సీబీ జట్టు తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. అలాగే వారి పనితీరు కూడా అద్భుతంగా ఉంది. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ పూర్తిగా కొత్త జట్టును ఏర్పాటు చేస్తుందా లేదా ఇప్పటికే ఉన్న ఆటగాళ్లను ఉంచుకుని తమ జట్టును సిద్ధం చేస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌సీబీ టైటిల్ విషయం కూడా మనసులో ఉంచుకుని తన జట్టును సిద్ధంచేసుకోనుందని తెలుస్తోంది.
Also Read: Sivaramakrishnan: జీవితాంతం వర్ణ వివక్షకు గురయ్యాను.. మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్..