Paytm: పేటీఎం నయా సేవలు.. ఒక్క కార్డు అన్ని పనులు.. వన్ నేషన్ వన్ కార్డ్
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వన్ నేషన్ వన్ కార్డ్ అనే విజన్‌కు అనుగుణంగా Paytm ట్రాన్సిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్డ్
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వన్ నేషన్ వన్ కార్డ్ అనే విజన్‌కు అనుగుణంగా Paytm ట్రాన్సిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్డ్ వినియోగదారుల రోజువారీ అవసరాలను అనుగుణంగా ఉంటుంది. మెట్రో, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, మర్చంట్ స్టోర్‌లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉపయోగించవచ్చు. అంతే కాదు ఈ కార్డు ద్వారా మీరు ATM నుంచి డబ్బు కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
భారతీయులందరికీ బ్యాంకింగ్ లావాదేవీలను సులువుగా చేయడానికి పేటీఎం ట్రాన్సిట్ కార్డ్‌ను ప్రారంభించడం జరిగిందని Paytm పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డుకి అప్లై చేసుకుంటే నేరుగా వినియోగదారుల ఇంటికే డెలివరీ చేస్తారు. విక్రయ కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీపెయిడ్ కార్డ్ నేరుగా Paytm వాలెట్‌కి లింక్ చేయబడి ఉంటుంది. హైదరాబాద్‌లోని వినియోగదారులు ఇప్పుడు ట్రాన్సిట్ కార్డ్‌ని సులువుగా కొనుగోలు చేయవచ్చు.
Paytm ట్రాన్సిట్ కార్డ్ ప్రతి రోజు చేసే చిన్న చిన్న లావాదేవీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్డ్ ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్, అహ్మదాబాద్ మెట్రోలో ప్రారంభించారు. Paytm ట్రాన్సిట్ కార్డ్ ప్రజలు దేశంలోని ఏ మెట్రో స్టేషన్‌లోనైనా ఉపయోగించవచ్చు. Paytm ట్రాన్సిట్ కార్డ్ ద్వారా లక్షలాది మంది భారతీయులు ఒకే కార్డు ద్వారా అన్ని పనులు చేసుకోగలుగుతారని Paytm పేమెంట్స్ బ్యాంక్ MD & CEO సతీష్ గుప్తా తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 280 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలలో టోల్ ఛార్జీలను డిజిటల్‌గా చెల్లింపులు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.