AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter: శీతాకాలంలో క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తినాలి..! ఎందుకంటే..?

Winter: చలికాలం రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అనువైన సమయం. సీజనల్ కూరగాయలు, పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

Winter: శీతాకాలంలో క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తినాలి..! ఎందుకంటే..?
Winter Vegetables
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2021 | 7:16 PM

Share

Winter: చలికాలం రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అనువైన సమయం. సీజనల్ కూరగాయలు, పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. అయితే ఇవి తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లపై కచ్చితంగా పురుగుమందుల ప్రభావం ఉంటుంది. అందుకే వాటిని శుభ్రం చేసిన తర్వాతనే తినడం చేయాలి. ఈ విషయాన్ని మాత్రం అందరు గుర్తుంచుకోవాలి. అయితే చలికాలంలో తినాల్సిన ఆహారాల గురించి ఓ లుక్కేద్దాం.

1. ముల్లంగి ముల్లంగి శీతాకాలంలో ఎక్కువగా విక్రయిస్తారు. దీంతో రుచికరమైన రకరకాల వంటలు చేయవచ్చు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, రాగి సమృద్ధిగా దొరుకుతుంది. ఈ కూరగాయల జీర్ణ సమస్యల నుంచి ప్రజలను కాపాడుతుంది.

2. చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఈ కాలంలో విరివిగా దొరుకుతుంది. ఇందులో చాలా పోషకాలు దాగి ఉన్నాయి. వీటితో చేసిన కూర రోటిలలో ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. చిక్కుళ్ళు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప ఆహారం.

3. చిలగడదుంప చిలగడదుంపు చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా పండిస్తారు. బర్గర్‌లు, చిప్స్, చాట్‌లలో కూడా దీనిని వినియోగిస్తారు. ఇందులో ఫైబర్, అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. చిలగడదుంపలలో బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహా రోగులకు చక్కగా ఉపయోగపడుతుంది.

4. ఉసిరి ఉసిరి శీతాకాలంలో విరివిగా లభిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరికాయను అనేక మార్గాలలో తినవచ్చు. శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఉసిరి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను నయం చేస్తుంది.

IND vs NZ, 1st Test, Day 5 Highlights: డ్రాగా ముగిసిన కాన్పూర్‌ టెస్ట్.. చివరి వికెట్‌ సాధించలేకపోయిన భారత్‌

IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్ట్‌.. భారత్‌ పోరాటం వృథా..

పరగడుపున నిమ్మకాయ రసం తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి..