Pensioners: పెన్షన్ పొందడం ఇప్పుడు చాలా సులభం..! ఏ పత్రాలు అవసరం లేదు..

Pensioners: కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రారంభించారు. ఇది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ రుజువుగా

Pensioners: పెన్షన్ పొందడం ఇప్పుడు చాలా సులభం..! ఏ పత్రాలు అవసరం లేదు..
Life Certificate
Follow us
uppula Raju

|

Updated on: Nov 29, 2021 | 8:50 PM

Pensioners: కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రారంభించారు. ఇది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ రుజువుగా పని చేస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన పౌరులకు సులభంగా యాక్సెస్‌ని నిర్ధారిస్తుంది. పెన్షన్‌ దారులందరు పెన్షన్ కొనసాగింపు కోసం ఏటా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన విషయం అందరికి తెలిసిందే. ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్‌గా సర్టిఫికేట్‌లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది.

పెన్షన్‌ దారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సింగ్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రవేశపెట్టి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ పెన్షనర్లకు మరింత దోహదపడుతుందని వివరించారు. లైఫ్ సర్టిఫికేట్‌లను అందించే ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ చారిత్రాత్మకమైనదని, ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఇది 68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల జీవితాలను సుస్థిరం చేస్తుందన్నారు. అంతేకాకుండా EPFO, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు.

ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు UIDAIకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఈజ్ ఆఫ్ లివింగ్ తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని మంత్రి అన్నారు. కరోనా వైరస్ కాలంలో కూడా తాత్కాలిక పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ విడుదల కోసం పెన్షన్ డిపార్ట్‌మెంట్ అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని పునరుద్ఘాటించారు. పెన్షన్ డిపార్ట్‌మెంట్ తన పని కోసం సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తోందని కొనియాడారు.

Hyderabad‌: నూతన ఓటరు నమోదుకు ఈ నెల 30 చివరితేది.. మార్పులు చేర్పులకు కూడా అవకాశం..

Winter: శీతాకాలంలో ఈ పని తప్పకుండా చేయాలి.. లేదంటే అది మీకు లభించదు..

Winter: శీతాకాలంలో క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తినాలి..! ఎందుకంటే..?