Auto-Rickshaw: సామాన్య ప్రజలకు మరో షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక ఆటో ఎక్కితే జీఎస్టీ చెల్లించాల్సిందే..!
Auto-Rickshaw: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలతో సతమతమవుతున్న ప్రజలపై మరో భారం మోపనుంది. ఒక వైపు..
Auto-Rickshaw: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలతో సతమతమవుతున్న ప్రజలపై మరో భారం మోపనుంది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బతకడమే కష్టంగా మారుతున్న సామాన్యులకు మరింత భారం మోపేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది. అందుకు ప్రకటన కూడా చేసింది. ఆన్‌లైన్ ద్వారా ఆటో బుక్ చేసుకునే ప్రయాణికులకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
2022 జనవరి నుంచి ఆటో ప్రయాణం చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 5 శాతం మేర జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఓలా, ఉబెర్ ఆటోలలో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి ఈ భారం పడనుంది. సాధారణంగా ఆటోలో ఎక్కి డబ్బులు చెల్లించే వారికి ఎలాంటి జీఎస్టీ అనేది ఉండదు. కేవలం ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ భారం పడనుంది.
ఇవి కూడా చదవండి: