AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తున్న ఆర్బీఐ.. మరో బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!

RBI: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ ఎత్తున జరిమానా విస్తోంది. గత రెండు రోజుల కిందట స్టేట్‌..

RBI: బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తున్న ఆర్బీఐ.. మరో బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!
Subhash Goud
|

Updated on: Nov 29, 2021 | 8:47 PM

Share

RBI: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ ఎత్తున జరిమానా విస్తోంది. గత రెండు రోజుల కిందట స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కోటి రూపాయల జరిమానా విధించిన ఆర్బీఐ.. ఇప్పుడు అదే జరిమానా మరో బ్యాంకుకు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్‌ బ్యాంకు జారీ చేసిన ఆదేశాలలో నిబంధనలు సరిగ్గా పాటించని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. ఆర్బీఐ ప్రకారం.. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 46 (4)(i), 51 (i) సెక్షన్‌లోని 47A (1) (c) నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించింది. అలాగే ఆర్బీఐ ఆదేశాలు పాటించనందున జరిమానా ఎందుకు విధించకూడదో తెలుపాలని బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది.

కాగా, రెండు రోజుల కిందట ఎస్‌బీఐకి కోటి రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్దంగా రుణగ్రహీత కంపెనీల్లో బ్యాంకుకు షేర్లున్నట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19లో సబ్‌-సెక్షన్‌ ప్రకారం ఆర్బీఐ ఈ జరిమానా వేసింది. ఏ బ్యాంకింగ్‌ కంపెనీ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా, లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్‌ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు. అనంతరం ఆదేశాలను ఉల్లంఘించినందుకు దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!

Follow Us
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!