IPL 2022: ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు.. ఆటగాళ్లకు ఎంత డబ్బు దక్కనుంది.. ఐపీఎల్ 2022 రిటెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయంటే?

IPL 2022 Retention Rules: IPL 2022 (IPL 2022)లో 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొనబోతున్నాయి. 10 జట్ల మెగా వేలానికి ముందు రెటెన్షన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.

IPL 2022: ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు.. ఆటగాళ్లకు ఎంత డబ్బు దక్కనుంది.. ఐపీఎల్ 2022 రిటెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయంటే?
Ipl 2022 Retention Rules
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:03 PM

IPL 2022 Retention Rules: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలపై భారత క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. దీనిపై మొత్తం 10 బృందాలకు సమాచారం అందించారు. అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్ల సంఖ్యను నిర్ణయించడంతో పాటు ఒక్కో ఆటగాడికి అందించే మొత్తాన్ని కూడా బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు IPL 2022 మెగా వేలానికి ముందు ఒక్కొక్కరు నలుగురిని ఉంచుకోవచ్చని తెలిసిందే. అదే సమయంలో, టోర్నమెంట్‌లోకి వచ్చిన మరో రెండు కొత్త జట్లు వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను జోడించవచ్చని తెలిపింది. ఈ మేరకు క్రిక్‌బజ్ నివేదికలో పేర్కొంది. ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ పంపిన మెయిల్‌ను అందించింది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ఎనిమిది పాత జట్లు ఉన్నాయి. అదే సమయంలో, లక్నో, అహ్మదాబాద్ ఇటీవల టోర్నమెంట్‌లోకి కొత్తగా వచ్చాయి.

ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. దీని తర్వాత, వేలానికి ముందు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను జోడించుకోవచ్చని తెలిపింది. ఆటగాళ్లను తమతో తీసుకెళ్లేందుకు ఒక్కో జట్టుకు గరిష్టంగా రూ.90 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ఎనిమిది పాత జట్లు నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2021 మధ్య ఆటగాళ్లను కలిగి ఉండాలని పేర్కొంది. అదే సమయంలో, రెండు కొత్త జట్లు డిసెంబర్ 1 నుంచి 25 మధ్య ఆటగాళ్లను కలిగి ఉండాలని పేర్కొంది.

ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నియమాలు.. పాత ఎనిమిది జట్లు గరిష్టంగా ముగ్గురు భారత ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వీరిలో క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఏ జట్టు కూడా ఇద్దరు కంటే ఎక్కువ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేయలేరు. అదే సమయంలో, పాత జట్లు గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్ల విషయానికొస్తే, వారు గరిష్టంగా ఇద్దరు భారతీయ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వారిలో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని మాత్రమే తమతో తీసుకెళ్లగలరు.

మొత్తం 10 టీమ్‌లకు రూ. 90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. జట్లు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే, వారి బడ్జెట్‌లో రూ. 42 కోట్లు, ముగ్గురు ఆటగాళ్లకు రూ. 33 కోట్లు, ఇద్దరు ఆటగాళ్లకు రూ. 24 కోట్లు, అలాగే ఒక ఆటగాడిని మాత్రమే రిటైన్ చేసుకుంటే రూ. 14 కోట్లు కోత పడనుంది. ఒక జట్టు ఈ ఇచ్చిన స్లాబ్‌ల కంటే ఎక్కువ డబ్బును ప్లేయర్‌కు ఇవ్వాలనుకుంటే, ఆ డబ్బు కూడా జట్ల పర్స్ నుంచి తీసివేస్తారు.

ఐపీఎల్ 2022 రెటెన్షన్ లైవ్.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను ప్రకటిస్తారు. దీని ప్రత్యక్ష ప్రసారం హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా tv9telugu.comలోనూ అప్‌డేట్‌లను చదవవచ్చు. మొత్తం సమాచారం మీకు తెలుగులో అందుబాటులో ఉంటుంది.

రిటైన్ చేసిన ఆటగాళ్లు ఎంత డబ్బు పొందనున్నారు.. నాలుగు రిటెన్షన్లు ఉంటే మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ఆటగాడికి రూ.12 కోట్లు, మూడో ఆటగాడికి రూ.8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ.6 కోట్లు దక్కనున్నాయి.

ఒక జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు లభిస్తాయి.

ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే ఏడాదికి రూ.14 కోట్లు మాత్రమే అందుతాయి. ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నా మొదటి ఆటగాడికి 14 కోట్లు, రెండో ఆటగాడికి 10 కోట్లు మాత్రమే లభిస్తాయి.

Also Read: IPL 2022 Mega Auction: ఇదే చివరి మెగా వేలం.. ఐదేళ్ల తరువాత నిర్వహణ.. మరోసారి ఉండదంటోన్న నివేదికలు.. ఎందుకంటే?

IPL 2022 Retention Live Streaming: ఎనిమిది జట్లలో ఉండేదెవరో.. ఆక్షన్‌కు వెళ్లేదెవరో? మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 రిటెన్షన్ జాబితా..!