IPL 2022 Retention Live Streaming: ఎనిమిది జట్లలో ఉండేదెవరో.. ఆక్షన్‌కు వెళ్లేదెవరో? మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 రిటెన్షన్ జాబితా..!
IPL 2022లో 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటాయి. తదుపరి సీజన్ కోసం మెగా వేలం జరగాల్సి ఉంది. దానికంటే ముందు ఎనిమిది పాత జట్లకు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు.
IPL 2022: ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30, మంగళవారం నాడు వెల్లడిస్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్దేశించిన రిటెన్షన్ గడువు మంగళవారంతో ముగిసింది. అయితే ఎవరు ఉన్నారు.. ఎవరు వీడారో మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉంటారా లేదా అనే ఊహాగానాలతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ ప్లేయర్ల వేలం పూల్‌లోకి వెళ్లనున్నారు. రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్‌లు చాలా మంది వేలం పూల్‌లోకి వస్తారా లేదా పాత జట్లే ఉంచుకోనున్నాయా అనేది అభిమానులకు ఆసక్తికరంగా మారింది.
IPL 2022 రిటెన్షన్ ప్రత్యక్ష ప్రసార వివరాలు.. భారత్‌లోని క్రికెట్ అభిమానులు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ IPL 2022 Retentionని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించనుంది. అలాగే ఈ ఈవెంట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Disney+ Hotstar వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈవెంట్ భారతదేశంలో నవంబర్ 30న సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకానుంది.
ఐపీఎల్ తదుపరి సీజన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. లీగ్ 15వ సీజన్‌లో 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటాయి. లక్నో, అహ్మదాబాద్‌లు లీగ్‌లో భాగమయ్యే రెండు కొత్త జట్లు. కోల్‌కతాకు చెందిన వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా యొక్క RP-SG గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. రూ. 7090 కోట్లకు ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదే సమయంలో, అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడి సంస్థ CVC క్యాపిటల్ అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసింది. సీవీసీ క్యాపిటల్ ఈ టీమ్‌ను రూ.5600 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ 10 జట్లకు ఆటగాళ్ల వేలం వచ్చే ఏడాది జరగనుంది. అయితే ఆ మెగా వేలానికి ముందు మంగళవారం రిటెన్షన్ ప్రక్రియ జరగనుంది. తమ జట్టులోని నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అన్ని జట్లకు అవకాశం కల్పించారు. ఇందులో, ఫ్రాంఛైజీ గరిష్టంగా 2 విదేశీ లేదా 3 స్వదేశీ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. అంటే, 4 మందిలో కనీసం ఒక విదేశీ ఆటగాడిని కలిగి ఉండటం అవసరం. దీని వ్యవధి నవంబర్ 30 వరకు మాత్రమే ఉంది.
వేలంలోjr స్టార్ ప్లేయర్లు రానున్నరా? ప్రస్తుత ఎనిమిది జట్లలో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను ఖరారు చేస్తారు. రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్‌లు డిసెంబర్ 1 నుంచి 25 వరకు ముగ్గురు ఆటగాళ్లను ఎన్నుకునే అవకాశాన్ని పొందుతాయి. ఆ తర్వాత జనవరిలో వేలం నిర్వహిస్తారు. కొన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను నిలుపుకోవచ్చు. అయితే కొన్ని జట్లు తక్కువ మంది ఆటగాళ్లను ఉంచుకోవడం ద్వారా తమ ప్రధాన ఆటగాళ్లను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. వేలంలోకి ప్రవేశించిన ఆటగాళ్ల నుంచి తమ జట్టు ప్రధాన టీంను తయారు చేస్తాయి. వచ్చే ఏడాది జరగనున్న భారీ వేలానికి ముందు చివరి క్షణాల్లో చాలా జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలం పర్స్ ధర రూ. 90 కోట్లుగా బీసీసీఐ ప్రకటించింది. 2021 ఐపీఎల్ వేలంలో రూ.85 కోట్లు ఫిక్స్ కాగా, ఈసారి వేలంలో రూ.5 కోట్లు పెంచారు.
IPL 2022 కోసం రిటెన్షన్ ఎప్పుడు జరుగుతుంది?
నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు.
IPL 2022 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను ఎప్పుడు ప్రకటిస్తారు?
IPL 2022 కోసం రిటెన్షన్ నవంబర్ 30న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
IPL 2022 రిటెన్షన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
IPL 2022 రెటెన్షన్ లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ఉంటుంది. హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. TV9లో ఈ రిటెన్షన్ లైవ్ అప్‌డేట్‌లను చదవవచ్చు.
83 Trailer: కపిల్ దేవ్‌గా రణ్‌వీర్.. క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న 83 ట్రైలర్..