AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Ashwin: అదే నాకు ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ .. తన రిటైర్మెంట్‌ గురించి నాలుగేళ్ల క్రితమే చెప్పేసిన అశ్విన్‌..

కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది టీమిండియా. చివర్లో న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ప్రతిఘటించడంతో మ్యాచ్‌ను డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది..

Ravichandran Ashwin: అదే నాకు ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ .. తన రిటైర్మెంట్‌ గురించి నాలుగేళ్ల క్రితమే చెప్పేసిన అశ్విన్‌..
Basha Shek
|

Updated on: Nov 30, 2021 | 1:09 PM

Share

కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది టీమిండియా. చివర్లో న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ప్రతిఘటించడంతో మ్యాచ్‌ను డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టీమిండియా అగ్రశ్రేణి స్పి్న్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఈ టెస్ట్‌ మరుపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ టెస్ట్‌లో మొత్తం 6 వికెట్లు తీసిన ఈ ఆఫ్‌స్పి్న్నర్.. టీమిండియా తరఫున టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హర్భజన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. అనిల్‌ కుంబ్లే, కపిల్‌ దేవ్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 80 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ మొత్తం 418 వికెట్లను తనఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత అతని ఫామ్‌ను చూస్తే కపిల్, కుంబ్లేలను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు.

అయితే కుంబ్లే రికార్డును ఎప్పుడూ అధిగమించాలనుకోవట్లేదని చెబుతున్నాడు అశ్విన్‌. ఈ విషయంపై ఇప్పుడు కాదు నాలుగేళ్ల క్రితమే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడీ స్పిన్నర్‌. 2017లో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘ నేను అనిల్‌ కుంబ్లేకు పెద్ద అభిమానిని. ఆయన టెస్ట్‌ క్రికెట్‌లో మొత్తం 619 వికెట్లు తీసి దిగ్గజ క్రికెటర్‌గా నిలిచారు. నేను కుంబ్లేను అధిగమించాలనుకోవడం లేదు. ఒకవేళ నేను 618 వికెట్లకు చేరుకుంటే అదే నాకు ఆఖరి మ్యాచ్‌ అవుతుంది. ఆ క్షణమే ఆటకు వీడ్కోలు పలుకుతాను ‘ అని తన రిటైర్మెంట్ గురించి వ్యా్ఖ్యానించాడు. ఇక తాజాగా హర్భజన్‌ను అధిగమించడంపై స్పందించిన అశ్విన్‌… ‘ క్రికెట్‌లో రికార్డులు ఎప్పటికప్పుడూ మారిపోతుంటాయి. ఓ పదేళ్ల తర్వాత ఎన్ని వికెట్లు తీశామన్నది ముఖ్యం కాదు. ఆటలో మనకు ఎన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్నదే ముఖ్యమని రాహుల్‌ భాయ్‌ చెప్పాడు. వచ్చే 3-4 ఏళ్లలో నేను అలాంటి జ్ఞాపకాలనే పొందాలనుకుంటున్నాను ‘ అని చెప్పుకొచ్చాడు.

Also read:

IND vs NZ: రెండో టెస్టుకు రహానేపై వేటు పడనుందా!.. హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ ఏమంటున్నారంటే..

515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?

IPL 2022: విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్‌కు ఆర్‌సీబీ గుడ్ బై.. రిటైన్ చేసుకునేది వీరేనా.. కెప్టెన్ అతడేనా.!