AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్‌కు ఆర్‌సీబీ గుడ్ బై.. రిటైన్ చేసుకునేది వీరేనా.. కెప్టెన్ అతడేనా.!

ఐపీఎల్ 2022 రిటైన్ ప్లేయర్స్ లిస్టుపై ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అనుభవంతో పాటు ఫామ్ ఉన్న మిడిల్ ఆర్డర్...

IPL 2022: విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్‌కు ఆర్‌సీబీ గుడ్ బై.. రిటైన్ చేసుకునేది వీరేనా.. కెప్టెన్ అతడేనా.!
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Nov 30, 2021 | 12:34 PM

Share

ఐపీఎల్ 2022 రిటైన్ ప్లేయర్స్ లిస్టుపై ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అనుభవంతో పాటు ఫామ్ ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లపై చాలా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్ల సెలక్షన్ కూడా దాదాపుగా పూర్తయింది. మరికొద్దిసేపట్లో ఫ్రాంచైజీల వారీగా రిటైన్ ప్లేయర్స్ లిస్టు విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో.. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. అలాగే మిడిల్ ఆర్డర్‌లో ఏబీ డివిలియర్స్ రిటైర్‌మెంట్ ఇవ్వడం.. ఆ జట్టుకు పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇక ఈ జట్టులో కీలక ఆటగాడైన యుజ్వేంద్ర చాహల్‌కు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను రిటైన్ చేసుకోనుందని జాతీయ మీడియా ‘ఇన్‌సైడ్ సపోర్ట్’ పేర్కొంది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి విరాట్ కోహ్లీ RCBతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ 2021 వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ దక్కించుకుంది. ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన మ్యాక్స్‌వెల్.. ఒంటిచేత్తో పలు విజయాలను జట్టుకు అందించాడు. కాగా, ఈ ఏడాది మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌ను చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో మ్యాక్సీ.. పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

చాహల్‌కు ఆర్సీబీ గుడ్ బై…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్‌ పేరు లేనట్లు జాతీయ మీడియా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. ఫ్రాంచైజీకి, చాహల్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. చాహల్ మెగా వేలంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమచారమ. ఇక అటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే అవకాశం ఉందని కొంతమంది అంటున్నా.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి చాహల్ కీ ప్లేయర్…

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు యుజ్వేంద్ర చాహల్ ప్రాతినిధ్యం వహించాడు. 2011-13 మధ్య ముంబై జట్టుకు కీలక బౌలర్‌గా వ్యవహరించిన చాహల్.. ఆ తర్వాత 2014-21 వరకు ఆర్‌సీబీ టీం బెస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. ప్రతీ సీజన్‌లోనూ జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా చాహల్ 114 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 139 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 4/25.

ఇవి కూడా చదవండి:

Viral Photos: అగ్గిపెట్టె లాంటి చిన్న ఇల్లు.. లోపల చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు వైరల్!

515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?

Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..