- Telugu News Photo Gallery Viral photos Pictures of mini 100 square foot homes in japan will shock after seeing interior
Viral Photos: అగ్గిపెట్టె లాంటి చిన్న ఇల్లు.. లోపల చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు వైరల్!
జపాన్ రాజధాని టోక్యో నగర సమీపంలో నిర్మించిన మినీ హోమ్స్ ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తున్నాయి. స్వీడిష్ కంపెనీ IKEA 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి ఇంటిని నిర్మించి విక్రయిస్తోంది. ఏంటి చిన్న ఇల్లా.? అని ఆలోచించకండి.! లోపలికి వెళ్లి.. దాని ఇంటీరియర్ చూస్తే మీరు ఖచ్చితంగా మైమరిచిపోతారు.
Updated on: Nov 29, 2021 | 9:32 PM

జపాన్ రాజధాని టోక్యో నగర సమీపంలో నిర్మించిన మినీ హోమ్స్ ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తున్నాయి. స్వీడిష్ కంపెనీ IKEA 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి ఇంటిని నిర్మించి విక్రయిస్తోంది. ఏంటి చిన్న ఇల్లా.? అని ఆలోచించకండి.! లోపలికి వెళ్లి.. దాని ఇంటీరియర్ చూస్తే మీరు ఖచ్చితంగా మైమరిచిపోతారు.

షింజుకులో 100 చదరపు అడుగుల విస్తీరణలో నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్ ప్రస్తుతం లీజుకు అందుబాటులో ఉందని IKEA వెల్లడించింది. జనవరి 2023 వరకు దానిని వినియోగించుకోవచ్చుట.

32 చదరపు అడుగులలో ఎవరైనా కూడా ఈ ఇంటిలో అద్దెకు దిగొచ్చు. ఈ ఇళ్లులన్నీ కూడా షింజుకు రైల్వే స్టేషన్‌కు దగ్గరలో నిర్మించబడ్డాయట.

బయట నుంచి చూడటానికి అగ్గిపెట్టె లాంటి ఇళ్లు మాదిరిగా కనిపించినా.. లోపల ఇంటీరియర్ అద్భుతంగా ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఆ ఇళ్లల్లో వంట గది, బాత్రూమ్, బెడ్ రూమ్ ఉన్నాయి. ఫర్నీచర్, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, ఫోల్డబుల్ టేబుల్, షెల్ఫ్ కూడా ఉంటాయి. ప్రజలు తమంతట తామే హాయిగా వంట చేసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకొచ్చు. ఇక ఆ ఇంట్లో పైకి వెళ్లేందుకు లోపల నుంచి మెట్లు ఉంటాయట.

IKEA జపనీస్ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను టోక్యో సమీపంలోని షింజుకు నగరంలో ప్రారంభించింది. సామాన్యులకు కూడా లభించే విధంగా అందుబాటు ధరల్లో వీటిని విక్రయిస్తున్నారు.