Viral Video: భార్య కొట్టిందని ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసు ఓదార్పు వింటే నవ్వులే నవ్వులు..

Viral Video: ఒకొక్కసారి సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియాలు నెట్టింట్లో ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటూ... ఆ వీడియోలను గుర్తు తెచ్చుకుంటే..

Viral Video: భార్య కొట్టిందని ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసు ఓదార్పు వింటే నవ్వులే నవ్వులు..
Viaral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2021 | 1:39 PM

Viral Video: ఒకొక్కసారి సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియాలు నెట్టింట్లో ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటూ… ఆ వీడియోలను గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ నవ్వేలా ఉంటాయి. ఇటీవల ఓ స్టూడెంట్ నా పెన్సెల్ దొంగిలించాడు.. పోలీస్ కేసు పెట్టండి అంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సంగతి తెల్సిందే.. ముద్దుగా ఈ చిన్నారులు చెప్పే ఫిర్యాదు.. ఆ స్టూడెంట్స్ పంచాయితీని తీర్చిన పోలీసుల ఫన్నీ వీడియో ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయిందో తెలిసిందే.. తాజాగా ఓ యువకుడు వెక్కి వెక్కి ఏడుస్తూ.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.. అంతేకాదు తనను తన భార్య గట్టిగా కొట్టాడుతుందని పోలీసులకు చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు తన భార్యపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు ఆ భర్త చెప్పాడు.

దీంతో అక్కడనున్న పోలీస్ స్పందించి.. ఆ భర్తని సముదాయించాడు. పొద్దున్నే రమ్మని.. పెళ్ళాం కొట్టడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయిందని అన్నాడు ఆ పోలీసు.. అయినా ఏమి చేస్తాం.. పెళ్లాలు కొడతారు.. ఏమి చేస్తాం.. ప్రస్తుతం జమానాలో మగవారి పరిస్థితి అలా అయిపొయింది అని ఆ భర్తని ఊరడించి అక్కడ నుంచి పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read:  ఓ వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన సిగరెట్ కాల్చే అలవాటు.. నెట్టింట్లో వీడియో వైరల్..