Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..

మనందరం పెళ్లి గురించి ఎన్నో కలలు కంటాం. పెళ్లి ఇలా జరగాలి.. అలా జరగాలంటూ పలు ప్రణాళికలను సిద్దం చేసుకుంటాం...

Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 30, 2021 | 7:38 AM

మనందరం పెళ్లి గురించి ఎన్నో కలలు కంటాం. పెళ్లి ఇలా జరగాలి.. అలా జరగాలంటూ పలు ప్రణాళికలను సిద్దం చేసుకుంటాం. ముందుగానే డబ్బులు దాచుకోవడం లాంటివి చేస్తాం. మన పెళ్లి బాలీవుడ్ స్టైల్‌లో జరగాలని ఆశిస్తాం. మూడు రోజుల పెళ్లి.. మెహందీ.. సంగీత్.. ఇలా ఒకటేమిటీ వివాహం అంగరంగ వైభవంగా జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో జరగాలని కోరుకుంటాం. అయితే ప్రతీ ఒక్కరూ వివాహం కోసం కలలు కనరు. కొంతమంది తమ కెరీర్‌పై దృష్టి పెడతారు. ఎన్నో సాధించాలని అనుకుంటారు. అయితే జోతిష్యశాస్త్రం ప్రకారం.. 5 రాశులవారు కేవలం పెళ్లి గురించే అలోచిస్తారట. వారికి పెళ్లికి బాగా తొందరెక్కువట. ఎన్నో కలలు కంటారట. మరి ఆ రాశులు ఏంటి.? అందులో మీరున్నారా.! అనేది తెలుసుకోండి..

1. మేషరాశి:

ఈ రాశివారు చాలా మంచివారు, విశాల హృదయులు. ఒక్కసారి మీరు గానీ వీరి ప్రేమలో పడినట్లయితే.. ఈ రాశివారు తమ ప్రేమను నిరూపించుకునేందుకు ఏడు సముద్రాలు దాటమన్నా దాటేస్తారు. తమ ప్రేమను వివిధ రకాలుగా వ్యక్తపరుస్తారు. వీరు చాలా ఎమోషనల్. తమకు ఇష్టమైనవారిని సంతోషపరిచేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూడరు. త్వరగా వివాహం చేసేసుకుంటారు.

2. వృషభరాశి:

ఈ రాశివారు వ్యక్తిత్వంలో చాలా స్ట్రాంగ్. ప్రతీ విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ప్రేమ విషయంలో అయితే ఆలోచించడానికి సుదీర్ఘ సమయాన్ని తీసుకుంటారు. ఒకదానిని ఏదైనా దక్కించుకోవాలని అనుకునప్పుడు.. దాని కోసం దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తారు. ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యరు. తమ బంధం పట్ల విధేయతతో ఉంటారు. పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటారు.

3. సింహరాశి:

ఈ రాశివారు గాఢమైన ప్రేమికులు. తమకు నచ్చినవారు జీవితంలోకి వచ్చిన వెంటనే పెళ్లి కోసం తొందరపడతారు. వీరు ప్రేమపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. లాంగ్-లాస్టింగ్ రిలేషన్‌షిప్‌ను కోరుకుంటారు. వీరు చాలా ఓపికతో వ్యవహరిస్తారు. ఒక్కసారి వారు సహానాన్ని కోల్పోతే బంధాన్ని మధ్యలోనే వదిలేస్తారు.

4. తులారాశి:

ఈ రాశివారు ప్రేమ, పెళ్లి గురించి కలలు కంటారు. కానీ చాలా అనిశ్చితతో ఉంటారు. వీరు ఈజీగా ప్రేమలో పడిపోతారు. దీర్ధకాలిక నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశివారికి బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. వీరు ఏదైనా ఓ పెద్ద పనిని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. మళ్లీ గందరగోళానికి గురి కాకముందే దాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఒకవేళ మీ పార్టనర్ తులారాశి వారు అయితే.. పెళ్లికి తొందరపెడితే ఆశ్చర్యపోకండి.!

5. కుంభరాశి:

ఈ రాశివారు ఎవరితోనైనా కూడా డీప్‌గా కనెక్ట్ అవుతారు. వీరు ఒకరితో డీప్ రిలేషన్‌లోకి దిగితే.. పెళ్లి విషయంలో ఎక్కువగా తొందరపడతారు. ప్రతీ క్షణం తన భాగస్వామితోనే గడపాలని కోరుకుంటారు. వీరు పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అస్సలు అనుకోరు. కానీ తమ భాగస్వామితో వరల్డ్ టూర్ వీరి డ్రీమ్.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.