AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

83 Trailer: కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న 83 ట్రైలర్‌..

Ranveer Singh Kapil Dev movie: 83లో టీమిండియాకు సారథ్యం వహించి ప్రపంచకప్‌ను ముద్దాడారు కపిల్‌ దేవ్‌. ఎలాంటి అంచనాలు లేని జట్టును నాయకుడిగా ముందుకు నడిపించి, ఏకంగా విశ్వవిజేతగా నిలబెట్టారాయన.

83 Trailer: కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న 83 ట్రైలర్‌..
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Share

1983లో టీమిండియాకు సారథ్యం వహించి ప్రపంచకప్‌ను ముద్దాడారు కపిల్‌ దేవ్‌. ఎలాంటి అంచనాలు లేని జట్టును నాయకుడిగా ముందుకు నడిపించి, ఏకంగా విశ్వవిజేతగా నిలబెట్టారాయన. ఈక్రమంలో భారత క్రికెట్‌ చరిత్రలో ఓ దిగ్గజంగా నిలిచిన కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ’83’. కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించాడు. ఆయన సతీమణి పాత్రలో దీపికా పదుకొణె నటించింది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ’83’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

కాగా 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్‌ 175 పరుగులు చేసి జట్టును గెలుపుబాటలో నడిపిస్తారు. ట్రైలర్‌ కూడా అక్కడి నుంచే మొదలైంది. కీలకమైన జింబాబ్యే మ్యాచ్ లో త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోవడం, అప్పటికింకా బాత్రూంలో ఉన్న కపిల్ దేవ్ ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోవడం వంటి సన్నివేశాలను ఎంతో ఆసక్తిగా చూపించారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం రాక అప్పట్లో క్రికెటర్లు ఇబ్బంది పడడం, మీడియా, విదేశీ జట్లు హేళన చేయడం, ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఉత్కంఠభరిత సంఘటనలతో ట్రైలర్‌ సాగింది. మొత్తానికి క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా క్రీడాభిమానులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.Also Read:

Kangana Ranaut: ట్విట్టర్‌ సీఈఓ మార్పుపై తనదైన శైలిలో స్పందించిన కంగనా.. ఏమన్నారంటే..

Vijay Devarakonda Liger: మహేష్‌తో పోటీపడనున్న విజయ్‌ దేవరకొండ.. బాక్సాఫీస్‌ ముందు భారీ పోటీ తప్పదా.?

Mohanlal: క్రూయిజ్‌నౌకలో మరక్కార్‌ ప్రమోషన్‌.. నేవీ అధికారులు, ఫ్యాన్స్‌తో మోహన్‌లాల్‌ చిట్‌ చాట్‌..