AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: క్రూయిజ్‌నౌకలో మరక్కార్‌ ప్రమోషన్‌.. నేవీ అధికారులు, ఫ్యాన్స్‌తో మోహన్‌లాల్‌ చిట్‌ చాట్‌..

సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాదు.. దానిని సరైన రీతిలో ప్రమోషన్‌ చేసి ప్రేక్షకులకు చేయాలి. అప్పుడే సినిమా సక్సెస్‌ రేటు పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం కొవిడ్‌ కాలం నడుస్తోంది..

Mohanlal: క్రూయిజ్‌నౌకలో మరక్కార్‌ ప్రమోషన్‌.. నేవీ అధికారులు, ఫ్యాన్స్‌తో మోహన్‌లాల్‌ చిట్‌ చాట్‌..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Share

సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాదు.. దానిని సరైన రీతిలో ప్రమోషన్‌ చేసి ప్రేక్షకులకు చేయాలి. అప్పుడే సినిమా సక్సెస్‌ రేటు పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం కొవిడ్‌ కాలం నడుస్తోంది. సినీ అభిమానులు ఓటీటీలకు కూడా ఓటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే దర్శక నిర్మాతలు వినూత్న రీతిలో ప్రమోషన్లు నిర్వహించాలి. ఈ విషయాన్ని ‘మరక్కార్‌’ చిత్ర బృందం బాగానే గ్రహించింది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ సినిమాను ఏకంగా క్రూయిజ్‌షిప్‌లో నిర్వహించి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘మరక్కార్‌’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ వంటి తారలు ఈ సినిమాలో నటించారు. మొదట మార్చి 2020లో ‘మరక్కార్‌’ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే కరోనా అడ్డుపడడంతో చాలాకాలం పాటు వాయిదా పడుతూ వస్తోంది. పరిస్థితులు సహకరించకపోవడంతో ఒకానొక దశలో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధమయ్యారు. అయితే ఎట్టకేలకు డిసెంబరు 3న థియేటర్‌లలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. మలయాళం సినీ చరిత్రలోనే మొదటిసారిగా, వినూత్నంగా క్రూయిజ్‌షిప్‌లో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించింది. ఇండియన్ నేవీకి చెందిన కొంత మంది అధికారులు, ఎంపిక చేసిన అభిమానులు క్రూయిజ్ షిప్‌లో హీరో మోహన్ లాల్‌తో కలిసి ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా నేవీ అధికారులు, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌లాల్‌ సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)

Also Read:

Nidhi Agarwal: అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను.. ఆసక్తికరమై పోస్ట్‌ చేసిన అందాల నిధి..

Megastar Chiranjeevi: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసిన చిరు… తనయ నీహారికపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

Puneeth Rajkumar: నా సోదరుడి మరణం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది.. పునీత్‌ రాఘవేంద్ర భావోద్వేగం..