AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhi Agarwal: అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను.. ఆసక్తికరమై పోస్ట్‌ చేసిన అందాల నిధి..

Nidhi Agarwal: 2017లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'మున్నా మైఖేల్‌'తో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార నిధి అగర్వాల్‌. అనంతరం నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' సినిమాతో...

Nidhi Agarwal: అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను.. ఆసక్తికరమై పోస్ట్‌ చేసిన అందాల నిధి..
Nidhi Agarwal
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Share

Nidhi Agarwal: 2017లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘మున్నా మైఖేల్‌’తో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార నిధి అగర్వాల్‌. అనంతరం నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తన అందంతో ఆకట్టుకుంది. ఇక అన్నతో ఆడిపాడిన వెంటనే తమ్ముడి అఖిల్‌తో ‘మిస్టర్‌ మజ్నూ’లో నటించిందీ బ్యూటీ. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’తో ఒక్కసారిగా క్రేజ్‌ సంపాదించుకుందీ బ్యూటీ. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకోవడం ఈ బ్యూటీకి అలవాటు.

ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ వేదికగా కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. పింక్‌ కలర్‌ చీరలో దిగిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో నిధి నిజంగానే అందాలను తనలో దాచుకున్న అందాల నిధిగా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్‌ అందరినీ ఆలోచింపచేస్తోంది. ‘ఒక అందమైన, మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. దీంతో అందాల నిధి మనసు పెళ్లిపై పడిందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ క్యాప్షన్‌తో పాటు ఆమె జత చేసిన కొన్ని స్మైలీ సింబల్స్‌ చూస్తుంటే నిధి అగర్వాల్‌ తమాషాగా ఈ పోస్ట్‌ చేసినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో నటించే చాన్స్‌ కొట్టేసింది. క్రిష్‌ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Nellore Rains: నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం, పొంగిపొర్లున్న వాగులు వంకలు

News Watch Live: వరిపై కేసీఆర్ ఎందుకు ఇంతగా కొట్లాడుతున్నారో తెలుసా..?(Video)

Face For Robots: మీ ఫేస్‌రైట్స్ రూ.1.5 కోట్లు.. ఫేస్‌తో చిట్టి రోబోని తయారుచేస్తామంటున్న కంపెనీ.. ఎలా అప్లై చేయాలంటే..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?