Face For Robots: మీ ఫేస్‌రైట్స్ రూ.1.5 కోట్లు.. ఫేస్‌తో చిట్టి రోబోని తయారుచేస్తామంటున్న కంపెనీ.. ఎలా అప్లై చేయాలంటే..

Face For Robots: సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమా గుర్తుందా.. సైంటిస్ట్ రజనీకాంత్ అచ్చు తనకులా ఉండే రోబో చిట్టిని సృష్టిస్తాడు. అది సినిమా.. అదే నిజ జీవితంలో కూడా..

Face For Robots: మీ ఫేస్‌రైట్స్ రూ.1.5 కోట్లు.. ఫేస్‌తో చిట్టి రోబోని తయారుచేస్తామంటున్న కంపెనీ.. ఎలా అప్లై చేయాలంటే..
Face For Robots

Face For Robots: సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమా గుర్తుందా.. సైంటిస్ట్ రజనీకాంత్ అచ్చు తనకులా ఉండే రోబో చిట్టిని సృష్టిస్తాడు. అది సినిమా.. అదే నిజ జీవితంలో కూడా ఆవిష్కరిస్తామంటున్నారు కొందరు సైంటిస్ట్ లు. మీ ముఖంతో రోబోని కావాలనే ఆసక్తి ఉంటె.. కొన్ని అర్హతలు ఉంటె చాలు అప్లై చేసుకోవచ్చు. రోబోలపై నిజమైన మానవ ముఖాన్ని ముద్రించేందుకు సాంకేతిక సంస్థ ఆసక్తిని చూపిస్తుంది. మీరు టెక్ కంపెనీకి దాని హక్కులను విక్రయించడానికి సిద్ధంగా ఉంటే మీ ముఖం మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. ఎవరైనా తమ ఫేస్ ని రోబో రూపానికి ఇచ్చినందుకు ఒకటి కాదు రెండు ఏకంగా కోటి రూపాయలకు పైగా రివార్డ్ ని కూడా ఇస్తామంటున్నారు సదరు సంస్థ.. మరి ఎలా అప్లై చేయాలి.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇప్పడు తెలుసుకుందాం..

కొత్త రోబోల శ్రేణిని లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్న ప్రోమోబాట్ అనే రోబోటిక్స్ త‌యారీ కంపెనీ ఇస్తున్న ఆఫ‌ర్ అది.  ఈ టెక్ కంపెనీ, తమ క్రియేషన్‌లు మనుషుల్లాగే స్నేహపూర్వక ముఖాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది. దీంతో తాము కంపెనీ త‌యారు చేసే రోబోల‌ను మ‌నిషి ముఖాన్ని అమ‌ర్చాల‌ని భావించింది.  దీంతో ఎవ‌రైనా త‌మ ముఖానికి సంబంధించిన రైట్స్‌ను ఇవ్వడానికి అంగీకరిస్తే వారికి వాళ్లకు £1,50,000 (భారత కరెన్సీలో రూ.1.5 కోట్లు) ఇస్తామ‌ని కంపెనీ ప్రక‌టించింది. తమకు జాతి, స్త్రీ, పురుషులనే బేధం లేదని.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని షరత్తులున్నాయి. అవి ఏమిటంటే.. దరఖాస్తుదారు వయస్సు 25 ఏళ్లు పైబడి ఉండాలి. ముఖం చూడ‌టానికి సింపుల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటే చాలు.. అని కంపెనీ ప్ర‌క‌టించింది.

యుఎస్ఎ కు చెందిన ఈ కంపెనీ ఫేషియల్ రికగ్నిషన్, అలాగే స్పీచ్, అటానమస్ నావిగేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ యొక్క ఇతర రంగాల్లో సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. 2019 నుండి హ్యూమనాయిడ్ రోబోట్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ టెక్ కంపెనీకి ఈ ముఖాన్ని ఇవ్వాల‌నుకుంటే వెంట‌నే ఆ కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సెలెక్ట్ చేసిన వాళ్ల 3డీ ముఖాన్ని స్కాన్ చేసుకుంటారు. అయితే మీ ముఖంగా జీవితాంతం ఈ కంపీనీ ఉపయోగించుకుంటుంది. అందుకు రైట్స్‌ను కంపెనీకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక మీ ముఖంతో పాటు వాయిస్‌ను కూడా స్కాన్ చేసుకుంటారు. ఆరోబోతో ముఖాన్ని ఇచ్చిన వ్య‌క్తి వాయిస్‌తోనే లింక్ చేసి మాట్లాడేలా చేస్తారు.

మరి మీ ఫేస్ తో రోబోని చూసుకోవాలని ఉందా..కోటీశ్వరులు కావాలని ఉంటె.. వెంటనే ఆ కంపెనీ వెబ్‌సైట్ లో దరఖాస్తు పెట్టుకోండి.

Also Read:  ఈ రెండేళ్లలో కరోనా రక్కసికి చిక్కిన భారత సైన్యం ఎంతమందో తెలుసా.. లెక్కలు చెప్పిన రక్షణ మంత్రి..

 

Click on your DTH Provider to Add TV9 Telugu