Smart TV Buying Tips: మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..

Smart TV Buying Tips: టెలివిజన్ చరిత్ర చెప్పాలంటే చాలా కథే ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలైన ప్రస్థానం.. స్మార్ట్ టీవీగా పరిణామం చెందింది. ఇంకా చెందుతూనే ఉంది.

Smart TV Buying Tips: మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..
Smart Tv
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2021 | 6:53 AM

Smart TV Buying Tips: టెలివిజన్ చరిత్ర చెప్పాలంటే చాలా కథే ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలైన ప్రస్థానం.. స్మార్ట్ టీవీగా పరిణామం చెందింది. ఇంకా చెందుతూనే ఉంది. అయితే, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మంచి స్మార్ట్ టీవీని కొనాలని భావిస్తున్నారు. స్మార్ట్ టీవీ కొనేముందు మంచి ఫీచర్లు, పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్‌ సిస్టమ్ ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. అన్నీ ఫర్‌ఫెక్ట్‌గా ఉంటే.. ఇంట్లో టీవీ షోలు, సినిమాలు చూస్తే థియేటర్‌లో చూసిన అనుభూతి కలుగుతుంది. అయితే, మీరు కూడా స్మార్ట్ టీవీని కొనుగోలు చేయబోతున్నట్లయితే.. ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి. టీవీ కొనుగోలు చేసే ముందు ఎలాంటి టీవీ కొనుగోలు చేయాలి, ఎలాంటి ఫీచర్లు ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పిక్చర్ క్వాలిటీ.. మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేసినప్పుడు, అది మంచి నాణ్యత గల HD లేదా 4K డిస్‌ప్లేను కలిగి ఉండేలా చూసుకోవాలి. అలాగే, టీవీని ఆన్ చేసి, దాని చిత్ర నాణ్యతను చెక్ చేసుకోవాలి. TV చిత్ర నాణ్యతను చెక్ చేస్తున్నప్పుడు, కార్టూన్‌లు నిత్యం వివిధ రంగులలో వస్తున్నందున.. వీలైనంత ఎక్కువగా గమనించండి. ఇది డిస్ప్లే ఎలా ఉంటుందో దాని గురించి ఒక అవగాహన కలిగేలా చేస్తుంది.

ధ్వని.. స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు, దాని ధ్వని(సౌండ్) మంచి నాణ్యతతో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సినిమాలు, ఇతర ప్రోగ్రామ్‌లను చూడటానికి మంచి, స్పష్టమైన ధ్వనిని కోరుకుంటారు. ఇందుకోసం స్మార్ట్ టీవీలో 5 నుంచి 10 వాట్ల స్పీకర్ ఉండేలా చూసుకోండి.

ఇతర ఫీచర్లు.. స్మార్ట్ టీవీకి హార్డ్ డిస్క్ సపోర్ట్ ఉండాలి. MP4, AVI, MKV వంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి. అదనంగా, HD కంటెంట్ చూడటానికి సులభంగా ఉండాలి. అందుకే.. టీవీని కొనుగోలు చేసేటప్పుడు, మీరు దానిలోని USB ప్లేబ్యాక్ పనితీరును చెక్ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. స్మార్ట్ టీవీని ఉపయోగిస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా అనేక రకాల యాప్‌లను అందులో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వై-ఫై, మోషన్ సెన్సార్ వంటి ఫీచర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనిని USB పోర్ట్ ఉపయోగించి కీబోర్డ్‌కి కూడా కనెక్ట్ చేయవచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..