- Telugu News Photo Gallery Technology photos Motorola Launches New Smart Phone Moto G31 Have A Look On Features And price Details
Moto g31: మార్కెట్లోకి మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 15 వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..
Moto g31: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో తాజాగా మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో జీ 31 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు.
Updated on: Nov 30, 2021 | 6:38 AM

ఇటీవల వరుస స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో సందడి చేస్తున్న మోటోరోలో తాజాగా మోటో జీ31 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెండు వేరియెంట్లలో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.4 అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ రిజెల్యూషన్(1,080 X 2,400), ఓఎల్ఈడీ హోల్-పంచ్ డిస్ ప్లేను అందించారు. మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ దీని సొంతం.

ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇక 5000 ఎమ్ఎహెచ్ వంటి శక్తివంతమైన బ్యాటరీ అందించిన ఈ ఫోన్‌లో ఎఫ్ఎమ్ రేడియో, 3.5మిమి ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 802.11 వంటి ఫీచర్లు ఉన్నాయి.




