Parag Agrawal: ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన అగర్వాల్ ట్వీట్.. చిన్నవయస్కుడైన సీఈవోగా రికార్డు
Parag Agrawal: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉన్న ట్విట్టర్..
Parag Agrawal: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం పదవీ నుంచి దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా నియమించింది. ఈ నేపథ్యంలో అగర్వాల్ ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. జాక్, మా బృందానికి కృతజ్ఞతలు. భవిష్యత్తు కోసం చాలా ఉత్సాహంగా పని చేస్తాను. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు. అయితే అగర్వాల్ 2021 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ముందు 2017 వరకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేశారు. సీటీవోగా కంపెనీ సాంకేతిక వ్యూహానికి ఆయన బాధ్యత వహించారు. సాంకేతికతను వేగవంతం చేస్తూ అభివృద్ధిని మెరుగు పర్చేందుకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో PhD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
చిన్నవయస్కుడైన సీఈవోగా రికార్డు:
ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలలో అతి చిన్నవయస్కుడైన సీఈవోగా అగర్వాల్ రికార్డు దక్కించుకున్నారు.ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 16 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవడంతో ప్రతిష్ఠాత్మక హోదా 37 ఏళ్ల అగర్వాల్‌కు దక్కింది. అగర్వాల్ ఐఐటీ విద్యార్థి. ముంబై ఐఐటీలోనే ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్‌లో ఉద్యోగంలో చేరిన ఆయన ఇప్పుడు సీఈవో స్థాయికి ఎదగడం విశేషం. అయితే సీటీవోగా సంస్థ టెక్నాలజీ స్ట్రాటజీ, కంపెనీ డెవలప్‌లో మెషిన్ లెర్నింగ్ వినియోగించే ప్రక్రియను తాను ముందుండి నడిపించానని ట్వీట్ చేశారు.
ఐఐటీ ముంబైలో పరాగ్ అగర్వాల్ కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ స్టాండ్‌ఫోర్డు యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందారు. అగర్వాల్ తల్లి టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన తండ్రి అటామిక్ ఎనర్జీ రంగంలో ఉద్యోగం చేసి, సీనియర్ స్థాయి వరకు వెళ్లారు. అగర్వాల్ ట్విటర్ లేఖ ద్వారా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: