AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Secret: గుడ్డు శాఖాహారమా? మాంసాహారమా? గుట్టురట్టు చేసిన శాస్త్రవేత్తలు.. మరి మన శాస్త్రాలు ఏంచెబుతున్నాయి..?

ప్రపంచంలో సరైన సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉందంటే అది.. ‘కోడి ముందా.. గుడ్డు ముందా?’ దీనికి ఇంతవరకూ సరియైన సమాధానమే దొరకలేదు.

Egg Secret: గుడ్డు శాఖాహారమా? మాంసాహారమా? గుట్టురట్టు చేసిన శాస్త్రవేత్తలు.. మరి మన శాస్త్రాలు ఏంచెబుతున్నాయి..?
Boiled Eggs
Balaraju Goud
|

Updated on: Nov 30, 2021 | 1:23 PM

Share

Egg Secret: ప్రపంచంలో సరైన సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉందంటే అది.. ‘కోడి ముందా.. గుడ్డు ముందా?’ దీనికి ఇంతవరకూ సరియైన సమాధానమే దొరకలేదు. అయితే దీనికి అనుబంధంగా ఉన్న మరో కఠిన ప్రశ్నకు సమాధానం మాత్రం లభించిది. అదే.. ‘గుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా?’… చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దానిని తినరు. వారి అభిప్రాయంలో నాన్‌వెజ్ కేటగిరీకి చెందిన కోడి… ఈ గుడ్డును ప్రసాదిస్తుంది. ఈ కారణంగానే దీనిని నాన్‌వెజ్‌గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్‌వెజ్ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నకు మాత్రం న్యూయార్క్ శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చేశారు.

ఈ వాదనకి స్వస్థి పలకాలనే సంకల్పంతో తీవ్రంగా అధ్యయనం చేసి గుడ్డుని శాఖాహారమే అని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చేశారు. వారి పరిశోధనల దృష్ట్యా వెల్లడించిన శాస్త్రీయపరమైన వివరణలు ఇలా ఉన్నాయి. దీనిని పక్కనపెడితే.. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. అంటేవాటి నుంచి కోడిపిల్ల బయటకు రాదు. అందుకే గుడ్డును శాకాహారంగా భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు వారు శాస్త్రీయపరమైన వివరణ కూడా ఇచ్చారు. గుడ్డులో మూడు భాగాలుంటాయి. శాస్త్రవేత్తలు తెలిపినదాని ప్రకారం గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయి. దానిలో ఎంటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమని తేల్చిచెప్పారు. ఇక పచ్చసొన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే, ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో కలయిక అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. దీని నుంచి కోడిపిల్ల వచ్చేందుకు అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

చివగా ఒక మాట: శాస్త్రవేత్తలు ఎంత చెప్పినా మన శాస్త్రాలు ఒప్పుకుంటాయో లేదో చూద్దాం..

Read Also… NTRUHS Recruitment: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..