Viral Video: చలివేస్తేనే కూతురు స్టైల్ మరచిపోయి.. శాలువా కోరుతుంది అంటున్న తల్లి.. వీడియో వైరల్..
Viral Video: ప్రస్తుత జనరేషన్ లోని అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో చేసే పనులు ఒకొక్కసారి వారినే ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా స్టైల్ , ఫ్యాషన్ గా కనిపించాలనే ఉద్దేశ్యంతో చాలామంది..
Viral Video: ప్రస్తుత జనరేషన్ లోని అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో చేసే పనులు ఒకొక్కసారి వారినే ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా స్టైల్ , ఫ్యాషన్ గా కనిపించాలనే ఉద్దేశ్యంతో చాలామంది అమ్మాయిలు చలికాలంలో బయటకు వెళ్తున్న సమయంలో స్వెటర్ ను వేసుకోవడానికి అంతగా ఆసక్తిని చూపించారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో.. సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు ఎంత చలివేసినా స్వెటర్ వేసుకోవడానికి అసలు ఇష్టపడరు. అలా స్వెటర్ వేసుకుంటే తాము ధరించిన బట్టల లుక్ పాడవుతుందని అమ్మాయిలు అనుకుంటారు. అలా ఓ అమ్మాయి చలి వేస్తున్నప్పుడు స్వెట్టర్ లేకుండా కుటుంబంతో కలిసి బయటకు వచ్చి.. చలిగా అనిపిస్తే.. తల్లిని ఆమె దుపట్టా ఇవ్వమని అడిగింది. అప్పుడు తల్లి కూతురుకి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కండువా అడగడంపై అమ్మ రియాక్షన్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తల్లీకూతురు సంభాషణ ఉన్న ఈ వీడియో.. చలికి పసితనం అంతా పోతుంది అనే క్యాప్షన్ తో యష్నా హండా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో, ఆమె తన తల్లితో రెస్టారెంట్ దగ్గర బయట కూర్చుని ఉన్నారు. అయితే అప్పుడు తల్లి పసుపు రంగు దుపట్టాని కప్పుకుని కూతురు కూర్చుని ఉంది. వేడి కోసం తన తల్లి పసుపు రంగు దుపట్టాని చుట్టుకున్న కూతురు ఈ వీడియోలో కన్పిస్తుంది. అయితే అప్పుడు తల్లి చేసిన తమాషా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆమె తల్లి కూతురుతో నువ్వు చిన్నపిల్లలా తయారు అయ్యి వచ్చావు.. ఇప్పుడు మా బేబీకి చున్నీ కావాలా అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పటివరకు 1.4 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ని దక్కించుకుంది. అయితే తల్లి కూతురుతో అన్నమాటలు నచ్చలేదని కొందరు కామెంట్ చేస్తే.. నేటి పిల్లలు చలికి బయటకు వెళ్లే సమయంలో కొంచెం ముందు జాగ్రత్త తీసుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి చాలామంది ఈ తల్లీ-కూతురు ద్వయాన్ని అభినందిస్తూ పోస్ట్‌పై ఫైర్, లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఒక నెటిజన్ తాను ఈ వీడియో క్లిప్ ను వందసార్లు చూసినట్లు.. లవ్ యు మోనా దీదీ” అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram