Keerthi Suresh: కీర్తి సురేష్ న్యూ లుక్స్ అదుర్స్.. .. రవి వర్మ పెయింటింగ్స్‌కు ప్రాణం పోసినట్లున్నాయిగా..
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అగ్రకథానాయికలలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అగ్రకథానాయికలలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో తన నటనతో అలనాటి సావిత్రిని సైతం మైమరపించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్న కీర్తి సురేష్ .. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి సురేష్ .. మలాయళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలై పోస్టర్స్, వీడియోస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా కీర్తి సురేష్.. ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను రవి వర్మ పెయింటింగ్స్ పక్క పక్కన పెట్టి ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కీర్తి ఫోటోస్.. అచ్చం రవి వర్మ పెయింటింగ్స్‌కు ప్రాణం పోసినట్లుగా ఉన్నాయని.. కీర్తి న్యూలుక్ అదిరిపోయిందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది.
View this post on Instagram
Also Read: Kiran Abbavaram: దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..
Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!