Nani: ముందే నాకు చెప్పాలనుకున్నారు.. కానీ మిస్ అయ్యి బాధపడ్డాను.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటించి నిర్మిస్తున్న సినిమా స్కైలాబ్. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటించి నిర్మిస్తున్న సినిమా స్కైలాబ్. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తుండగా.. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన స్కైలాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గర పడుతుందంటే టీమ్ సభ్యుల్లో తెలియని ఓ టెన్షన్ ఉంటుంది. కానీ ఈరోజు స్కైలాబ్ టీమ్‌లో ఆ టెన్షన్ కనపడటం లేదు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. కొన్ని సినిమాలకు అలా కుదురుతాయి. వైబ్ చెప్పేస్తుంది, సినిమా కొట్టేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం. పాజిటివ్ నెస్, ప్రేమ, సినిమా విజువల్స్ అన్నీ చూస్తుంటే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిపోతుందనే నమ్మకం ఉంది. స్కైలాబ్ గురించి నేను కూడా చిన్నప్పుడు కథ కథలుగా విన్నాను. అందరూ చాలా భయపడ్డారు. అలాంటి ఐడియాతో సినిమా చేయడమనేది చాలా ఎగ్జయిటింగ్ అనే చెప్పాలి. నిజానికి నేను డైరెక్టర్ విశ్వక్‌తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఈ కథను ముందు నాకే చెబుతామని అనుకుంటే కుదరలేదని. చాలా మిస్ అయ్యానని బాధేసింది. అయితే నిత్యా, పృథ్వీ నిర్మాతలు, మంచి టీమ్ చేతిలో పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా మొదలైంది సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయాల్లో చిన్న పిల్లల్లా ఉండేవాళ్లం. స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌లా ఆ సినిమాను ఎంజాయ్ చేశాం. మణిరత్నం వంటి డైరెక్టర్స్‌కే నిత్యా మీనన్ ఫేవరేట్ యాక్టర్. ఆమె ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. అంత మంచి యాక్టర్ ఈ సినిమాతో తన ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసిందంటే, గర్వంగా ఫీల్ అవుతుందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించవచ్చు. రామానాయుడుగారిలా, సురేష్‌బాబుగారిలా, దిల్‌రాజుగారిలా వందల సినిమాలు తను ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక సత్యదేవ్ గురించి చెప్పాలంటే.. తను స్టార్ అవబోతున్న యాక్టర్‌లా అనిపిస్తాడు. తను ఎంచుకుంటున్న సినిమాలు, పెర్ఫామెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాళ్లు మంచి స్థాయికి చేరుకుంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. తనలాంటి డిఫరెంట్ మూవీస్ చేసే హీరోలు మనకు కావాలి. తనకు ఆల్ ది వెరీ బెస్ట్. రాహుల్ రామకృష్ణ టెరిఫిక్ యాక్టర్. తనకు అభినందనలు. డైరెక్టర్ విశ్వక్‌కి ఆల్ ది బెస్ట్. స్కై లాబ్ సక్సెస్‌కి స్కై లిమిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 4న స్కైలాబ్ బాక్సాఫీస్ మీద పడబోతుందని నాకు తెలుసు. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Also Read: Kiran Abbavaram: దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..