Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. ‘ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదంటూ’ క్లాస్‌ పీకిన అఖిల్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్న వారికి ఏ స్థాయిలో సెలబ్రిటీ హోదా లభిస్తుందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నచ్చని వారు చేసే ట్రోలింగ్ దారుణంగా...

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. 'ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదంటూ' క్లాస్‌ పీకిన అఖిల్‌..
Biggboss 5 Telugu
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 6:01 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్న వారికి ఏ స్థాయిలో సెలబ్రిటీ హోదా లభిస్తుందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నచ్చని వారు చేసే ట్రోలింగ్ దారుణంగా ఉంటుంది. ఇటీవల ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నాడు బిగ్‌బాస్‌ 5 సీజన్‌ కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌. ఎన్నో వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ మూవీస్‌ యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన షణ్ముఖ్‌కు ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఫాలోయింగే అతన్ని బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేలా చేస్తూ వస్తోంది. అయితే తాజాగా షణ్ముఖ్‌ను ఓ నెటిజన్‌ దారుణంగా ట్రోల్‌ చేశాడు. చెత్త కాగితాలు ఏరుకునే వాడిలా ఉన్నావు అంటూ.. దారుణమైన పదజాలంతో దూషించాడు.

దీంతో సదరు నెటిజన్‌ చేసిన ఈ పోస్ట్‌పై మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అఖిల్‌ తీవ్రంగా స్పందించాడు. ఈ విషయమై అఖిల్‌ పోస్ట్ చేస్తూ.. ‘ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి! ఇది ఒక గేమ్‌ షో మాత్రమే.. చూసి ఎంజాయ్‌ చేయండంతే! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్‌ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్‌ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో’ అని రాసుకొచ్చాడు అఖిల్‌.

Akhil

ఇక ఒక వ్యక్తిని మరీ ఇంతలా విమర్శించడం ఎందుకు బ్రదర్‌ అంటూ.. ‘రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్‌ షోను గేమ్‌ షోలా మాత్రమే చూడండి’ అంటూ సదరు నెటిజన్‌కు గట్టిగానే క్లాస్‌ పీకాడు అఖిల్‌. ఇక అఖిల్‌ చేసిన ఈ పోస్టును రీట్వీట్‌ చేసిన షణ్ముఖ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Also Read: MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?

AP Minister: పగటి కలలు కంటున్న బాబు కోరిక ఎప్పటికీ నెరవేరదు.. చంద్రబాబుపై వెల్లంపలి సంచలన వ్యాఖ్యలు