Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Minister: పగటి కలలు కంటున్న బాబు కోరిక ఎప్పటికీ నెరవేరదు.. చంద్రబాబుపై వెల్లంపలి సంచలన వ్యాఖ్యలు

 Vellampalli on Babu: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఆశ ఎప్పటికీ..

AP Minister: పగటి కలలు కంటున్న బాబు కోరిక ఎప్పటికీ నెరవేరదు.. చంద్రబాబుపై వెల్లంపలి సంచలన వ్యాఖ్యలు
Vellampalli On Babu
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2021 | 12:38 PM

Vellampalli on Babu: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఆశ ఎప్పటికీ నెరవేరదని చెప్పారు. అంతేకాదు.. తమ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చారంటే తప్పకుండా దానిని నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా శ్రీశైలం లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీ అధినేత చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ది శశికళ శపథం వంటిది.. అది నెరవేరదని చెప్పారు. అసెంబ్లీ నుండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యిన జగన్ మోహన్ రెడ్డి, జయలలిత లాగా తాను ముఖ్యమంత్రి అవ్వుతానని చంద్రబాబు అంటున్నారు.. కలలు కంటున్నారు.. అవి నెరవేరవని చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.  నిజానికి చంద్రబాబు నాయుడు.. ఎప్పుడు సీఎం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల గురించి మాట్లాడారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు కుటుంబం గురించి అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదు.. ఆ రోజు నేను కూడా అసెంబ్లీలోనే ఉన్ననని మంత్రి చెప్పారు. ఉద్యోగస్తులు కొంచెం ఓపిక పట్టాలని మా నాయకుడు ఒకసారి చేస్తానని చెప్పాడు అంటే తప్పని సరిగా దానిని చేసి చూపిస్తారంటూ వెల్లంపల్లి ఉద్యోగులకు తెలిపారు.

Also Read: ఒమిక్రాన్ బాధిత దేశాలకు వ్యాక్సిన్ సరఫరా.. అత్యవసర మందులను అందించడానికి భారత్ రెడీ..