India Covid Vaccines: ఒమిక్రాన్ బాధిత దేశాలకు వ్యాక్సిన్ సరఫరా.. అత్యవసర మందులను అందించడానికి భారత్ రెడీ..
India Covid Vaccines: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కోవిడ్ వేరియంట్ 'ఒమిక్రాన్'తో బాధపడుతున్న దేశాలకు 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్ సరఫరాతో పాటు, ఇతర సహాయాన్ని..
India Covid Vaccines: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కోవిడ్ వేరియంట్ ‘ఒమిక్రాన్’తో బాధపడుతున్న దేశాలకు ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్ సరఫరాతో పాటు, ఇతర సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సోమవారం అందించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన ఆఫ్రికా సహా ఇతర దేశాలకు మన వంతు సాయం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. వ్యాక్సిన్ల సరఫరాలో మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను కూడా పంపించనున్నామని తెలిపింది.
ఆఫ్రికా దేశాలైన మలావి, ఇథియోపియా, జాంబియా, మొజాంబిక్, గినియా మరియు లెసోథో దేశాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల సరఫరా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు బొత్సవానా దేశానికి కొవాగ్జిన్ ను పూర్తిగా పంపించగలిగామని.. మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు అత్యవసరాలైన ప్రాణాలను రక్షించే మందులు, టెస్ట్ కిట్‌లను కూడా సరఫరా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని పేర్కొంది. గ్లౌజులు, పీపీఈ కిట్లు, మెడికల్ ఎక్విప్మెంట్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలు అవసరం కావచ్చని అవి కూడా పంపించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాలకు 25మిలియన్ డోసుల వరకూ వ్యాక్సిన్ సప్లై చేసింది. 16 దేశాలకు పది లక్షల డోసులు పంపేందుకు రెడీగా ఉంది. కొవాక్స్ ఫెసిలిటీలో భాగంగా 33దేశాలకు 16మిలియన్ డోసులు పంపనుంది.
India offers support for Africa to fight the Omicron variant of Covid-19.
Press Release ➡️ https://t.co/OqpySd3yjf
— Arindam Bagchi (@MEAIndia) November 29, 2021
Also Read: మలబద్ధకం, ఎముకల సమస్యలతో ఇబ్బందిపడేవారు రోజూ ఈ పాలను తాగితే అద్భుత ఫలితం..