Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ .. కీలక నిర్ణయాలు తీసుకున్న అమెరికా

Omicron Variant: కరోనా వైరస్ రక్కసి కోరల్లో చిక్కుకుని ఆరోగ్యానికి ప్రపంచంలోనే అధికంగా ప్రాధాన్యతనిచ్చే  అగ్రరాజ్యం అమెరికా సైతం ఓ రేంజ్ లో విలవిలాడింది.  కోవిడ్ 19 సృష్టించిన..

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ .. కీలక నిర్ణయాలు తీసుకున్న అమెరికా
Us Travel Ban
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2021 | 10:51 AM

Omicron Variant: కరోనా వైరస్ రక్కసి కోరల్లో చిక్కుకుని ఆరోగ్యానికి ప్రపంచంలోనే అధికంగా ప్రాధాన్యతనిచ్చే  అగ్రరాజ్యం అమెరికా సైతం ఓ రేంజ్ లో విలవిలాడింది.  కోవిడ్ 19 సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది.  ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తమైంది.. ముందస్తు చర్యలు చేపట్టింది. అమెరికాలో ఈ ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరవూ నమోదు కాలేదు. అయితే గతంలో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన వెంటనే దక్షిణాఫ్రికా నుంచి తమ దేశానికి వచ్చే విమాన సర్వీసులపై నిషేధం విధించింది.  తాజాగా మరికొన్ని దేశాల నుంచి విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల శాఖ దక్షిణాఫ్రికా తోపాటు జింబాబ్వే , బొట్స్వానా, నమీబియా, మొజాంబిక్, లెసొథొ, మలావిల, ఇస్వాతిని తదితర దక్షిణాఫ్రికా దేశాల ప్రయాణంపై నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు అక్కడ అధికారులు ప్రకటించారు.

అయితే స్వదేశానికి వచ్చే అమెరికా పౌరులు రావడానికి తమకి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఇతర దేశాలనుంచి వచ్చే ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ లోనే కరోనా టెస్టు చేయించుకోవాలని.. అప్పుడు నెగిటివ్ వచ్చినవారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఒమిక్రాన్‌పై ఖచ్చితమైన సమాచారం పొందడానికి రెండు వారాలు పడుతుందని యూఎస్ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు. అంతేకాదు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అమెరికాలో ఇంత వరకు బయటపడలేదు. ఇది మా సంసిద్ధతను పెంపొందించడానికి మాకు కొంత సమయం ఇవ్వబోతోంది” అని చెప్పారు. డెల్టా వేరియంట్ తర్వాత కొత్తరూపం దాల్చిన ఒమిక్రాన్ మరింత తీవ్రమైన అంటువ్యాధి కావొచ్చని ఆయన పేర్కొన్నారు. కెనడా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ  నైజీరియా నుండి ఇటీవల వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్ వచ్చింది. అంటారియోలో  మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Also Read:  రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొట్టేసిందా.. అయితే అల్పాహారంగా రుచికరమైన ప్రోటీన్ సోయా ఇడ్లీ ట్రై చేయండి..