ఎలాంటి నేరం చేయకుండానే జైల్లో 43 ఏళ్లు.. చివరికి నిర్ధోషిగా జైలు నుంచి విడుదల
సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా నేరం విషయంలో శిక్ష పడితే నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. చేసిన నేరాన్ని బట్టి చట్టప్రకారం జైలు శిక్ష ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై..
సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా నేరం విషయంలో శిక్ష పడితే నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. చేసిన నేరాన్ని బట్టి చట్టప్రకారం జైలు శిక్ష ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై బయటకు వస్తుంటారు. కొన్ని సార్లు ఎలాంటి నేరాలు చేయకుండానే జైలు శిక్షను అనుభవిస్తుంటారు. కానీ ఏ నేరం చేయని వ్యక్తి ఏకంగా 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిస్సోరీకి చెందిన కెవిన్ అనే వ్యక్తి 43 ఏళ్ల నిరీక్షణ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. కెవిన్ ముగ్గురి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాడు. కానీ అతని ఎలాంటి నేరం చేయలేదు. ఇటీవల న్యాయస్థానం అతన్ని నిర్ధోషిగా ప్రకటించడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడు. 18 ఏళ్ల వయసులో అరెస్టు అయిన కెవిన్.. 62 ఏళ్ల వృద్ధుడిగా జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఆయన జీవితం 43 ఏళ్ల పాటు జైల్లోనే గడిచిపోయింది. అయితే కెవిన్ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆన్‌లైన్ ప్రచారం నిర్వహించారు. ఇందులో కొంత మంది కలిసి 11 కోట్ల రూపాయలను వసూలు చేసి ఆయనకు విరాళంగా ఇవ్వడం గమనార్హం.
1978 ఏప్రిల్ 25వ తేదీన కాన్సాస్ నగరం లో ఒక ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురిని హతమర్చారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సింతీయ అనే మహిళ వారి నుంచి తప్పించుకుంది. తమపై కాల్పులు జరిపిన కెవిన్ కూడా ఉన్నారని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే ఆ తర్వాత ఆ మహిళ పొరపాటు పడి అతని పేరు చెప్పిందని తెలిసినప్పటికీ ఆ విషయం చెబితే తనకు ఎక్కడ శిక్ష పడుతుందో అని నోరు విప్పలేదు. దీంతో చేయని నేరానికి కెవిన్ అరెస్టు అయ్యారు. ఆ సమయంలో కోర్టు 50 ఏళ్ల శిక్ష విధించింది. అయితే దశాబ్దాలు గడిచిన తర్వాత ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ పటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ దోషిగా ఎలాంటి సాక్ష్యాలు లేని కారణంగా ఆయనను నిర్ధోషి అని కోర్టు తేల్చింది. ఈనెల 23న ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.
ఇవి కూడా చదవండి: