EPF Customers Alert: ఖాతాదారులు అలర్ట్‌.. నేటితో గడువు ముగింపు.. ఆధార్‌ లింక్‌ చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి..!

EPF Customers Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు..

EPF Customers Alert: ఖాతాదారులు అలర్ట్‌.. నేటితో గడువు ముగింపు.. ఆధార్‌ లింక్‌ చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:16 PM

EPF Customers Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. అయితే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ఆధార్‌తో లింక్ చేయడానికి నేటితో (నవంబర్‌ 30)తో గడువు ముగియనుంది. ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) UANతో ఆధార్ సీడింగ్, వెరిఫికేషన్ పూర్తి చేసే తేదీని నవంబర్ 30, 2021 వరకు పొడిగించింది. డిసెంబర్ 1, 2021 నుండి ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్‌లను (ECR) ఫైల్ చేయాలని యజమానులను కోరింది. UANతో ఆధార్ ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు EPFO మీ యజమాని ECR మార్గాన్ని ఉపయోగించి బదిలీ, ఉపసంహరణలను సులభతరం కానున్నాయి. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR)ని యజమాని ఉద్యోగి వివరాలతో EPFOకి తెలియజేయడం ద్వారా దాఖలు చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా UANతో ఆధార్ నంబర్ సీడ్ చేసిన ఉద్యోగులకు మాత్రమే ECR ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ తమ ఆధార్ కార్డ్ నంబర్‌ను తమ EPFO ​​UANకి లింక్ చేయని వారు, 30 నవంబర్ 2021లోపు లింక్ చేయాలి. e-KYC పోర్టల్‌లోని OTP ధృవీకరణ ద్వారా UANని Umang యాప్, మెంబర్ సేవా పోర్టల్ ఉపయోగించి ఆధార్‌కి లింక్ చేయవచ్చు.

UANను ఆధార్‌తో లింక్ చేయండిలా..

► పీఎఫ్ ఖాతాదారులు https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‎లోకి వెళ్లాలి.

► ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.

► యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

► ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

► ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

► అందులో Aadhaar సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.

► ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

► ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.

► ఆ తర్వాత వివరాలు ఓసారి సరిచూసుకోవాలి.

► మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.

► అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Post Office scheme: అద్భుతమైన స్కీమ్‌.. రూ.1000 పెట్టుబడితో ప్రారంభించి రూ.14 లక్షలు వరకు సంపాదించుకోండి

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా