Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు

Petrol-Diesel Price Today: వాహనదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి...

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Petrol-Diesel Price Today: వాహనదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముందే నిత్యవసర సరుకులు, గ్యాస్‌ ధరలు పెరుగుతుండటంతో భారంగా మారుతున్న సామాన్య జనాలకు.. ఈ పెట్రోల్‌ ధరలు నడ్డి విరుస్తున్నాయి. తాజాగా మంగళవారం (నవంబర్‌ 30) పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

► హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.62 వద్ద కొనసాగుతోంది.

► విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.70 వద్ద ఉంది.

► కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది.

► చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది.

► బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.71 శాతం పెరిగి 75.42 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.21 శాతం పెరిగి 71.02 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ ఇంధనం సగటు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను సవరిస్తాయి.

కాగా, ప్రస్తుతం ఉన్న ధరలు వందకులోపు దిగి వస్తే ఎంతో మేలంటున్నారు వాహణదారులు. వరుసగా వందకుపైగా పెరిగిన ధరలు.. ఇప్పుడు కొద్ది మొత్తంలో తగ్గింపు ఉంటే పెద్దగా ఒరిగేది ఏమి ఉండదంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో తడిసిమోపెడవుతోందని, ధరలు ఎంత పెరిగినా.. వాహనాలను తీయక తప్పని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

Post Office scheme: అద్భుతమైన స్కీమ్‌.. రూ.1000 పెట్టుబడితో ప్రారంభించి రూ.14 లక్షలు వరకు సంపాదించుకోండి

Auto-Rickshaw: సామాన్య ప్రజలకు మరో షాక్‌ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక ఆటో ఎక్కితే జీఎస్టీ చెల్లించాల్సిందే..!

Bank Depositors: నిషేధించబడ్డ ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వారి ఖాతాల్లో రూ.5 లక్షలు