AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Depositors: నిషేధించబడ్డ ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 12,014 మంది డిపాజిటర్లకు ఊరట

Bank Depositors: కొన్ని కొన్ని బ్యాంకులు అప్పుడప్పుడు దివాలా తీయడంతో మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం, ఖాతాదారులకు సరైన సేవలు అమలు..

Bank Depositors: నిషేధించబడ్డ ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 12,014 మంది డిపాజిటర్లకు ఊరట
Subhash Goud
|

Updated on: Nov 30, 2021 | 7:28 AM

Share

Bank Depositors: కొన్ని కొన్ని బ్యాంకులు అప్పుడప్పుడు దివాలా తీయడంతో మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం, ఖాతాదారులకు సరైన సేవలు అమలు చేయకపోవడం తదితర కారణాల వల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ మూసివేస్తుంటుంది. అలాంటి సమయంలో అందులో ఉన్న ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇక బెంగళూరుకు చెందిన శ్రీ గురు రాఘవేంద్ర సహకార్ బ్యాంక్ (SGRSBN)కి చెందిన 12,000 మంది ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు అందించించారు. రెండేళ్ల క్రితమే ఈ బ్యాంకు పనితీరు నిలిచిపోయింది. ప్రభుత్వ డిపాజిట్ గ్యారెంటీ పథకం కింద ఈ మొత్తాన్ని డిపాజిటర్లకు విడుదల చేశారు. నవంబర్ 29న 16 బ్యాంకుల ఖాతాదారులకు రూ.5 లక్షలు విడుదల చేయనున్నట్టు ఆదివారం వార్తలు వచ్చాయి. దీని కింద డిపాజిటర్లకు డబ్బు విడుదల చేయబడింది.

కాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు ఖాతాదారులకు 12,014 మంది ఖాతాల్లో రూ.401 కోట్లు విడుదల చేశామన్నారు. వేలాది మంది డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కష్టపడి సంపాదించిన డబ్బు మోసానికి గురైందని అన్నారు. ఇలాంటి డిపాజిటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చట్టంలో అనేక మార్పులు చేసింది. దీని ఫలితంగా, 12,000 మందికి పైగా డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద డబ్బు తిరిగి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం రూ.401 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య డిపాజిటర్లకు ఎంతో ఊరటనిచ్చిందని సూర్య అన్నారు.

అయితే ఈ బ్యాంకు లోక్‌సభ నియోజకవర్గం బెంగళూరు సౌత్‌లోనే ఉంది. డిపాజిట్ పథకం కింద 21,983 క్లెయిమ్‌లు చేయబడ్డాయి. వీటిపై డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) ద్వారా రూ.753.61 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. సోమవారం మొదటి విడతలో భాగంగా 12,014 మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.401 కోట్లు జమ అయ్యాయి. ఇందులో ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షలు వచ్చాయి. మిగిలిన డిపాజిటర్లకు కూడా త్వరలో డబ్బులు అందజేస్తామన్నారు. డిపాజిటర్లకు డిఐసిజిసి రూ.5 లక్షల వరకు ఇచ్చిందని ఎంపీ తెలిపారు.

శ్రీ గురు రాఘవేంద్ర సహకార్ బ్యాంకులో మొత్తం 43,619 మంది డిపాజిటర్లు ఉన్నారు. ఈ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) 10 జనవరి 2020న నిషేధించింది. ఈ బ్యాంకు లాభనష్టాల గురించి నకిలీ సమాచారాన్ని అందించింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ దానిని నిషేధించింది. ఈ సహకార బ్యాంకులో 33,390 మంది ఖాతాదారులు ఉన్నారని, వారి డిపాజిట్లు రూ. 5 లక్షల వరకు ఉన్నాయి. ఈ డిపాజిటర్లలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం అన్ని సహకార బ్యాంకులను RBI నియంత్రణలో ఉంచింది. దీని కోసం బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని సవరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం బ్యాంకులకు గ్యారెంటీ డిపాజిట్ల మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఖాతాదారులు దరఖాస్తును సమర్పించిన తేదీ నుండి 90 రోజులలోపు రూ. 5 లక్షల వరకు మొత్తాన్ని విడుదల చేయాలని డిఐసిజిసి చట్టం కింద ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది.

RBI: బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తున్న ఆర్బీఐ.. మరో బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!

Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!