AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!

Liquor Consumption: ప్రస్తుతమున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మద్యానికి బానిసవుతున్నారు. చిన్న నుంచి పెద్దల వరకు మద్యం లేనిది ఉండటం లేదు. తాజాగా జాతీయ కుటుంబ..

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!
Subhash Goud
|

Updated on: Nov 29, 2021 | 4:42 PM

Share

Liquor Consumption: ప్రస్తుతమున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మద్యానికి బానిసవుతున్నారు. చిన్న నుంచి పెద్దల వరకు మద్యం లేనిది ఉండటం లేదు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. ఆరోగ్య సర్వే-5 డేటాను విడుదల చేసింది. ఈ సర్వేలో అధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాను బయటపడింది. లక్షలాదిమందిపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మద్యం సేవించే పురుషుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ అని తేలింది. ఈ సర్వేలో మద్యం సేవించడంపై 15 ఏళ్లుపైబడిన వారి నుంచి పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టింది జాతీయ ఆరోగ్య సంస్థ. ఇందులో దేశంలో 18.8 శాతం మంది పురుషులు, 1.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమైంది. అయితే రాష్ట్రాల వారీగా గణాంకాలు వేరేగా ఉన్నాయి. జనాభా ప్రకారం.. అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముందుంది. అతి తక్కువ మద్యం వినియోగించేది లక్షద్వీప్‌. ఉంది.

అయితే నిషేధం ఉన్న రాష్ట్రాల్లో మద్యం కూడా వినియోగిస్తారు. బీహార్ మరియు గుజరాత్‌లలో, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాన్ని అమలు విధించాయి. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ మద్యం సేవిస్తారు. బీహార్‌లో 15.5 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తుండగా, గుజరాత్‌లో 5.8 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే ద్వారా తేలింది.

అరుణాచల్‌లో అత్యధికంగా మద్యపానంలో 52.7 శాతం పురుషులు, 24.2 శాతం మహిళలు ఉన్నారు. తెలంగాణలో 43.3 శాతం పురుషులు, 6.7 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇక మరోవైపు సిక్కిం రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి వరుసగా 39.8 మరియు 16.2 శాతం ఉంది.

ఇక అండమాన్ నికోబార్‌లో 39.1 శాతం మంది పురుషులు, 5 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మణిపూర్‌లో 37.5 శాతం మంది పురుషులు, 0.9 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో మద్యం సేవించే పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి వరుసగా 13.9 మరియు 0.4 శాతంగా ఉంది.

అలాగే రాజస్థాన్‌లో 11 శాతం మంది పురుషులు, 0.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 8.8 శాతం మంది పురుషులు, 0.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో, ఈ సంఖ్య లక్షద్వీప్‌లో అత్యల్పంగా ఉంది. ఇక్కడ మద్యం సేవించే పురుషులు, స్త్రీలలో వరసగా 0.4 శాతం, 0.3 శాతం ఉన్నట్లు జాతీయ సర్వే తేల్చింది.

ఇవి కూడా చదవండి:

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?