High Protein Diet: రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొట్టేసిందా.. అయితే అల్పాహారంగా రుచికరమైన ప్రోటీన్ సోయా ఇడ్లీ ట్రై చేయండి..

High Protein Diet: అల్పాహారం రాజులా తినండి, మధ్యాహ్న భోజనం యువరాజులా తినండి, రాత్రి భోజనం పేదవాడిలా తినండి" అనే సామెత మనందరికీ సుపరిచితమే. రోజూ పొద్దున్న టిఫిన్ గా పోషకాహారాన్ని..

High Protein Diet: రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొట్టేసిందా.. అయితే అల్పాహారంగా రుచికరమైన ప్రోటీన్ సోయా ఇడ్లీ ట్రై చేయండి..
Soya Idli
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2021 | 9:48 AM

High Protein Diet: అల్పాహారం రాజులా తినండి, మధ్యాహ్న భోజనం యువరాజులా తినండి, రాత్రి భోజనం పేదవాడిలా తినండి” అనే సామెత మనందరికీ సుపరిచితమే. రోజూ పొద్దున్న టిఫిన్ గా పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్లు ఉన్న అల్పాహారం మీ రోజును హ్యాపీగా ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని ఇస్తుంది.  అయితే మీరు శరీరం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గించేందుకు  సహాయపడుతుంది. ఇందుకు రోజు తీసుకునే టిఫిన్ లో గుడ్లు, చికెన్‌లు అత్యంత సాధారణమైన ఎంపిక అయితే.. సోయా ఇడ్లీ అల్పాహారంగా మంచి ఎంపిక. అధిక ప్రోటీన్ ఆహారమైన ఈ సోయా ఇడ్లీలో సోయాబీన్‌తో పాటు బియ్యం , మినపప్పు ఉంటుంది. ఈ మూడు పదార్ధాలను   నానబెట్టి, మెత్తగా రుబ్బి..  పులియబెట్టి ఈ పిండితో ఇడ్లీ తయారు చేస్తారు.  ఈరోజు సోయా ఇడ్లీ తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

సోయాబీన్స్

మినపప్పు

బియ్యం

తయారీ విధానం: ముందుగా మినపప్పు, బియ్యాన్ని , సొయా బీన్స్ వేరువేరుగా నానబెట్టుకోవాలి. ఇలా ఒక 5 గంటలు నానబెట్టిన తర్వాత మినపప్పు, బియ్యాన్ని , సొయా బీన్స్  కలిపి రుబ్బుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కలిపి.. దానిని ఒక పక్కన పెట్టుకోవాలి. అలా ఒక 5 గంటలు పక్కకు పెట్టిన పులియబెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ వేసుకునే పాత్రను తీసుకుని పిండి ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకుని ఆవిరి పట్టుకుని ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ సోయాబీన్స్ ఇడ్లి రెడీ. ఈ సోయా బీన్స్ ఇడ్లిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్ తో సర్వ్ చేయండి.

ఈ సోయా ఇడ్లీని మరింత రుచిగా చేసుకోవానికి పిల్లలు ఇష్టంగా తినాలంటే క్యారెట్, స్వీట్ కార్న్ వంటివి జత చేసుకోవచ్చు.

ఇదే పిండితో ఇడ్లీ మాత్రమే కాదు దోసె ,  ఇడ్లీ ఉప్మా, ఉత్తపం, పనియారమ్స్ వంటివి అనేకవి తయారు చేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన సోయా ఇడ్లీ రెసిపీని ప్రయత్నించండి.

Also Read:  ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసిన చిరు… తనయ నీహారికపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే