MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?

MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో '100 రోజుల టెన్షన్' ఎందుకు?
Manchu Vishnu

మంచు విష్ణు మళ్లీ టార్గెట్టయ్యారు. ప్రకాశ్‌ రాజ్ ప్యానల్‌కి మరోసారి ఛాన్సొచ్చింది. టీ కప్పులో తుపానుల్లా మా సంఘంలో ఈ మేజిక్కులు, మ్యూజిక్కులు మామూలే కావచ్చు.

Janardhan Veluru

| Edited By: Ravi Kiran

Nov 30, 2021 | 5:12 PM

Manchu Vishnu: మంచు విష్ణు మళ్లీ టార్గెట్టయ్యారు. ప్రకాశ్‌ రాజ్ ప్యానల్‌కి మరోసారి ఛాన్సొచ్చింది. టీ కప్పులో తుపానుల్లా మా సంఘంలో ఈ మేజిక్కులు, మ్యూజిక్కులు మామూలే కావచ్చు. కానీ.. కొత్త అధ్యక్షుడికి అతి త్వరలో క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదన్న హింట్ అయితే బలంగానే కనిపిస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేసి మాకూ ఒకరోజొస్తుంది అంటూ ‘ఆ రోజు’ కోసం వెయిట్ చేస్తోంది అపోజిషన్ బ్యాచ్.

పెద్దపెద్ద కష్టాలొస్తే వాడికి సినిమా కష్టాలొచ్చాయంటారు. మరి.. సినిమా వాళ్లకే కష్టాలొస్తే.. మరీముఖ్యంగా సినిమా ఆర్టిస్టులకే కష్టాలొస్తే..? ఫికర్ మత్‌ కరో నేనున్నాగా అంటూ అభయమిచ్చి ఆయన ప్రెసిడెంట్‌ కుర్చీనెక్కి వారాలు నెలలు కూడా గడుస్తున్నాయి. కానీ.. మంచువారిచ్చిన మాటలు ఏమయ్యాయి… కష్టకాలంలో ఆయన నిజంగానే ముందుకొచ్చి నిలబడుతున్నారా?

సీనియర్ ఆర్టిస్టు శివశంకర్ కోవిడ్‌ బారిన పడి కోమాలో ఉన్నప్పుడు.. మా అధ్యక్షుడి నుంచి కనీస పలకరింపు లేదు.. అని అడిగేలోగానే.. ఇదిగో పరామర్శించొచ్చా అని ట్వీట్ చేశారు మంచువారబ్బాయి. ఏపీ సర్కార్ చట్టాలు మార్చి సినిమా పరిశ్రమకు లక్ష్మణరేఖలు గీస్తే.. ఇదేంటని నిలదీసే బాధ్యత మా అధ్యక్షుడికి లేదా అంటూ సోషల్ మీడియాలో విసుర్లు మొదలయ్యాయి. ఇదంతా ఒక ఎత్తయితే… కొన్ని రోజులుగా మా ఆఫీస్‌కు తాళం వేళ్లాడుతోంది ఎందుకు అనేవి కొత్త డౌట్లు.

పర్సనల్ రీజన్స్ వల్లే స్టాఫ్‌ రావడం లేదు.. ఈ నెల 28న మీటింగ్ పెట్టి సిబ్బందిని మార్చే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నాం అంటున్నారు మంచు విష్ణు. అంతే తప్ప ‘మా’ సభ్యులకు మేము ఎప్పుడూ అందుబాటులోనే వుంటాం వున్నాం కూడా.. అని క్లారిటీనిస్తోంది విష్ణు టీమ్‌. మాలో మహిళా సాధికారత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు, సభ్యుల ఆరోగ్య పరీక్షల కోసం కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం…ఇలా చెయ్యాల్సిన పనులన్నీ చకచకా చేస్తున్నాంగా అంటున్నారు మా అధ్యక్షుడు.

Manchu Vishnu

Manchu Vishnu, Prakash Raj

కానీ… 100రోజుల్లో సంఘంలో మార్పు తీసుకొస్తామని తొడ కొట్టినంత పని చేసిన కొత్త ప్రెసిడెంట్.. ఆ హండ్రెడ్ డేస్ మూమెంట్ సమీపిస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడం లేదు ఎందుకు అని నిలదీస్తోంది ప్రత్యర్థి వర్గం. అదిగదిగో ‘మా’ భవనం అంటూ గతంలో స్థల సేకరణ కూడా మొదలుపెట్టిన విష్ణు… గెలిచాక మాత్రం ఆ దూకుడు మిస్సయ్యారా..? ఆ మోనార్క్ మళ్లీ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లతో పొడవక ముందే మంచుమారాజు మేలుకుంటే మంచిది. లేకుంటే అవే సినిమా కష్టాలు రిపీటౌతాయ్ మరి.

– శ్రీహరి రాజా, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Ranveer Singh: కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న 83 ట్రైలర్‌..

Viral Video: జుట్టుని హెయిర్ డ్రైకి బదులు కుక్కర్‌తో ఆరబెట్టుకుంటున్న యువకుడు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటున్న నెటిజన్లు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu